Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఇర్రి అహల్య
నవతెలంగాణ-జనగామ
ఈనెల 27వ తేదీన జనగామ జిల్లా కేంద్రంలోని పూసలభవన్లో నిర్వహించు అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఇర్రి అహల్య పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రజాసంఘాల కార్యాలయంలో నిర్వహించిన హరిద్వా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. బిజెపి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు మహిళల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ మహిళలను బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మహిళలకు రక్షణగా ఉన్న ఏ ఒక్క చట్టాన్ని సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. మహిళా బిల్లును తక్షణమే పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని మహిళా రక్షణగా ఉన్న చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ శిక్షణ తరగతులలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బత్తుల హైమావతి ముఖ్య అతిథులుగా హాజరై క్లాసులు మహిళల హక్కులపై పెద్ద ఎత్తున నిర్వహించనున్నామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యురాలు చీర రజిత మోకు భవాని జిల్లా ఉపాధ్యక్షురాలు పందిళ్ళ కళ్యాణి పట్టణ అధ్యక్ష కార్యదర్శులు పొన్నాల ఉమా వరలక్ష్మి శ్రీలత తదితరులు పాల్గొన్నారు.