Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గార్ల
దేశ రాజధాని ఢిల్లీ, ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ లకు ఉచితంగా ఇస్తున్న 300 యూనిట్ల విద్యుత్ ను తెలంగాణ రాష్ట్రం లో కూడా అమలు చేయాలని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు భూక్య హరి నాయక్ డిమాండ్ చేశారు. దళిత, గిరిజన కుటుంబాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని టి జి ఎస్ అధ్వర్యంలో శుక్రవారం ఎఇ మహేందర్ బాబుకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం హద్దు అదుపులేకుండా విద్యుత్ చార్జీలు పెంచుతూ ప్రజలపై భారాలు మోపుతూ పేదల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి విద్యుత్ ధరల పెంపు పై ఉన్న శ్రద్ధ జీవో నెంబరు 342 ప్రకారం 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలుపై లేదని విమర్శించారు. వెనుకబడిన వర్గాలైన ఎస్సీ ,ఎస్టీ లకు ఉచితంగా 300 యూనిట్ల విద్యుత్‌ను అందించాలని లేని పక్షం లో దశల వారీగా అందోళన లు చేస్తామని హెచ్చరించారు. వినతిపత్రం అందజేసిన వారిలో మండల నాయకులు మాళోత్ శాంతి కుమార్,భూక్య పుల్ సింగ్,లాకావత్ శ్రీను,ప్రజా సంఘాల నాయకులు యం.గిరిప్రసాద్, వెంకన్న ఉన్నారు.