Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకుర్తి
మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లా కోఆప్షన్ సభ్యులు ఎండి మదర్, టిఆర్ఎస్ మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు ఎండి వహీద్ ఆధ్వర్యంలో పాలకుర్తి మండలానికి చెందిన మైనార్టీలు శుక్రవారం మంత్రి ఎర్రబెల్లిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. పాలకుర్తి మండల కేంద్రంలోని షాది ఖానా అసంపూర్తిగా ఉందని, కబరిస్తాన్ ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు కేటాయించాలని మంత్రి ఎర్రబెల్లి ని మైనార్టీలు కోరారు. స్పందించిన మంత్రి ఎర్రబెల్లి షాదీ ఖానా అభివద్ధి తో పాటు, కబరిస్తాన్ ప్రహరీ గోడ నిర్మాణానికి రూ10 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. మస్జిద్ కమిటీ అధ్యక్షులు సలాం, మండల కో ఆప్షన్ సభ్యులు సర్వర్ ఖాన్, మస్జిద్ కమిటీ కార్యదర్శి సలీం, ఇమామ్, బాబా ఖాన్, షరీఫ్, తాజ్ ఉద్దీన్, సర్వర్, యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.