Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోల్ బెల్ట్
సింగరేణి కాంటాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్( సిఐటియు) ఆధ్వర్యంలో భూపాలపల్లి ఏరియా జిఎం కార్యాలయం ముందు శుక్రవారం ధర్నా నిర్వహించారు. అనంతరం ఏరియా జనరల్ మేనేజర్ బళ్లారి శ్రీనివాసరావుకు పలు సమస్యలతో కూడిన వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కంపేటి రాజయ్య మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులకు ప్రతినెలా ఏడో తేదీ లోపు జీతాలు చెల్లించాలని, అప్డేటెడ్ సీఎం పీఎఫ్ చిట్టీలు, పాసు బుక్కులు అందించాలని, ఏప్రిల్ 2021 నుండి పెరిగిన డిఎ బకాయిలను వెంటనే చెల్లించాలని, జే ఏ సి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 26న జరిగిన అగ్రిమెంట్ అంశాల అమలుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదివారం శ్రీరాంపూర్ ఏరియాలో జరిగే కాంట్రాక్ట్ కార్మికుల మహాసభకు కార్మికుల పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరారు. నాయకులు సారయ్య, సంపత్ రెడ్డి, సుధాకర్, లక్ష్మీ, మదనమ్మ, మొగిలి, రాజయ్య పాల్గొన్నారు.