Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడ
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే ధాన్యం కొనుగోలు కేంద్రాలలో జరుగుతున్న మోసాలను నివారించి రైతులను నిలువు దోపిడీ చేస్తున్న వడ్డీ వ్యాపారస్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని అఖిలభారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తుందని ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు బుర్క వెంకటయ్య అన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం అఖిల భారత రైతు కూలి సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో తహసిల్దార్ చందా నరేష్ కు డిమాండ్ లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద జరుగుతున్న మోసాలు బస్తాకు మూడు కిలోల తరుగు, హమాలి ఖర్చులు క్వింటాల్ కు 15 రూపాయలు లారీ డ్రైవర్ కు బస్తాకు రెండు రూపాయల చొప్పున 100 బస్తాలు కాంటాలు చేస్తే ఒక బస్తా ధాన్యం రైతు నుండి నిర్ధాక్షిణ్యంగా తీసుకుంటున్న సందర్భంగా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మండలంలో వడ్డీ వ్యాపారస్తులు రైతులను నిలువు దోపిడీ చేస్తూ రైతుల వద్ద నుండి బలవంతంగా హమాలి ఖర్చులు తరుగు పేరుతో రైతులను మోసాలు చేస్తున్న వడ్డీ వ్యాపారస్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. వరి సన్నధాన్యానికి 3000 రూపాయలను వరి దొడ్డు ధాన్యానికి 2500 రూపాయలను పత్తి క్వింటాల్ కు 10000 రూపాయలు మొక్కజొన్నకు మూడు వేల రూపాయల చొప్పున రైతులకు మద్దతు ధర ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివాసి ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో రైతులు ఆరుగాలం పనిచేసి ఎన్నో కష్టనష్టాలకోర్చుకొని పంటలు పండిస్తున్న రైతంగానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధరను ప్రకటించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. పై విషయాలపై సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోకుంటే అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో దశల వారి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ మండల అధ్యక్ష కార్యదర్శులు బూర్క బుచ్చి రాములు, యాదగిరి యుగంధర్,పూనెం మోహన్ రావు,గజ్జి సోమన్న, జిట్టబోయిన రామచంద్రు, పోతుగంటి లక్ష్మయ్య,వెంకన్న, నారాయణరెడ్డి,సుందర్, మద్దెల నరసయ్య, మద్దెల వెంకటేష్, బంగారి లక్ష్మణ్, సరోజన,కాశయ్య, జిట్టిగట్టయ్య పాల్గొన్నారు.