Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ డిమాండ్
నవతెలంగాణ-నెల్లికుదురు
పోడు సాగు చేసుకున్న ప్రతీ ఒక్క రైతును ప్రభుత్వం గుర్తించి వారికి హక్కుపత్రాలు ఇవ్వాలని సీపీఐ(ఎం) మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో స్థానిక విశ్రాంతి భవనంలో మండల కమిటీ సమావేశం పెరమాండ్ల పుల్లయ్య అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో అనేక మంది 1980 నుంచి సాగు చేసుకుంటున్నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇతర పేదలందర్నీ ప్రభుత్వం రైతులను గుర్తించే పోడు సాగు హక్కు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అటవీ హక్కుల చట్టం ప్రకారం ఒక ఎస్టీలకు మాత్రమే పట్టాలు ఇస్తామని చెప్పడం ఇతర పేదలను గుర్తించకుండా వారి భూములను ప్రభుత్వం రెవెన్యూ మరియు ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చెందారు. పేదలు ఆ భూమిని నమ్ముకుని కుటుంబాలను పోషించుకుంటున్నారని ఇప్పుడు సర్వేల పేరుతోటి సాగుచెస్తున్న పేదలను అన్యాయం చేస్తున్నారని అలా చేయడం సరైనది కాదనన్నారు. తక్షణమే సాగులో ఉన్న ప్రతి సాగుదారుడికి రెవెన్యూ మరియు ఫారెస్ట్ అధికారులు పట్టాలు పంపిణీ చేయాలన్నారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గునగంటి రాజన్న, మండల కార్యదర్శి పెరుమాండ్ల తిలక్ బాబు, మండల నాయకులు ఇసంపల్లి సైదులు, బాబు గౌడు పాల్గొన్నారు.