Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ
జిల్లాలో ఆయిల్ ఫామ్ పంట సాగుపై శిక్షణ అవగాహన కార్యక్రమం జనగామ జిల్లా ఏలాంల గ్రామంలో వ్యవసాయ అధికారులు, హార్టికల్చర్ ఆఫీసర్స్ కు క్షేత్రస్థాయిలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఉద్యానవన అధికారిని లత మాట్లాడుతూ ఈ ఆయిల్ ఫామ్ సాగు పథకం జాతీయ వంట నూనెల మిషన్ ఆయిల్ ఫామ్ ద్వారా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ పంటల సాగు ఆవశ్యకతను దష్టిలో ఉంచుకొని మన ప్రభుత్వం 20 లక్షల ఎకరాలలో యుద్ధ ప్రాతిపదికన పంట మార్పిడి ప్రక్రియలో భాగంగా సాగు చేయడానికి నిర్ణయించారన్నారు. జనగామ జిల్లాను టీఎస్ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ కంపెనీ నికి కేటాయించడం జరిగిందని అన్నారు. ఇప్పటివరకు మండలాల వారీగా గుర్తించిన సాగు వివరాలు జిల్లాలో మొత్తంగా 1170 మంది రైతులను గుర్తించనైనది, 6 వేల పది ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ ఫామ్ పంటను సాగు చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పంటను ప్రోత్సహించడానికి ప్రధాన కారణం మన దేశ అవసరాలకు మనం ప్రస్తుతం పండించే నూనెల పంటలు సరిపోవడం లేకపోవడంతో ఈ సాగును పెంచుకున్నట్లు చెప్పారు. రోజు రోజుకు పెరుగుతున్న జనాభాను దష్టిలో ఉంచుకొని నూనెల వాడకం మున్ముందు భారీగా పెరిగే అవకాశం ఉన్నందున సుమారు 50 లక్షల ఎకరాలు సాగు చేయవలసిన అవసరం ఉందని అన్నారు. ఇతర పంటలతో పోలిస్తే నూనె పంటలతో అధిక శాతం దిగుబడి ఇవ్వడం జరుగుతుంది. ఒక ఎకరాకు రెండు నుండి మూడు టన్నుల నూనె దిగుబడి అవుతుందన్నారు. ఈ పంటకు చీడా ,పీడా బెడద కూడా చాలా తక్కువగా ఉంటుందని అన్నారు. దొంగల బెడద కూడా ఈ పంటకు ఉండదని తెలిపారు. డిఏఓ వినోద్, ఆయిల్ ఫుడ్ సుబ్బారావు, రాజశేఖర్, అస్గర్, జిల్లాలోని అన్ని మండలాల ఏవోలు, హెచ్ఓ లు ఏఈవోలు, తదితరులు పాల్గొన్నారు.