Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీసీసీ అధ్యక్షులను మార్చే అవకాశం
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
టీపీసీసీ కార్యవర్గంపై ఏఐసీసీ కసరత్తు చేస్తుంది. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి ఢిల్లీలో పార్టీ పెద్దలను కలుసుకొని ఈ విషయంపై చర్చలు జరిపారు. ఈ క్రమంలో రాష్ట్రంలో డిసిసి అధ్యక్షుల నుమార్చి వచ్చే ఎన్నికల నాటికి పార్టీని సన్నద్ధం చే యడానికి రంగం సిద్ధమైనట్లు పార్టీ వర్గాలు చెబుతు న్నాయి. టీపీసీసీకి కొత్త జంబోకార్యవర్గాన్ని నియ మించే అవకాశముంది. ఈ క్రమంలోనే డీసీసీ అధ్య క్షుల పనివిధానాన్ని ఇప్పటికే సమీక్షించిన జాతీయ నాయకత్వం డిసిసిలకు కొత్త అధ్యక్షులను నియమిం చనుందని తెలుస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 6 జిల్లాల డిసిసి అధ్యక్షులలో ఎవరిపై వేటు పడుతుంద న్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతుంది. వరంగల్, హ న్మకొండ జిల్లాల డిసిసి అధ్యక్షుడిగా ప్రస్తుతం నాయి ని రాజేందర్‌రెడ్డినే కొనసాగుతుండగా, ఈ రెండు జి ల్లాల కు వేర్వేరుగా డిసిసి అధ్యక్షులను నియమిస్తా రన్న ప్రచారం జరుగుతుంది. రెండు మూడ్రోజుల్లో టిపిసిసి జంబో కార్యవర్గంతోపాటు నూతన డిసిసి అధ్యక్షుల నియామకంపై ప్రకటన వెలువడే అవకాశ ముందని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతుంది.
టిపిసిసికి జంబో కార్యవర్గాన్ని నియమించనున్న ట్లు ప్రచారం జరుగుతున్న క్రమంలో వచ్చే శాసనసభ ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసేలా డిసిసిలకు నూ తన అధ్యక్షులను నియమించడానికి రంగం సిద్ధమైన ట్లు తెలుస్తుంది. ఈ మేరకు పార్టీ వర్గాల్లో ఈ విష యం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో డిసిసి అధ్యక్షుల ప నివిధానంపై ఇప్పటికే ఎఐసిసికి పార్టీ ఇన్‌ఛార్జిలు ని వేదికలు పంపినట్లు సమాచారం. దీంతో ఉమ్మడి వ రంగల్ జిల్లాలోని డిసిసి అధ్యక్షులపై ఎవరెవరిపై వే టు పడుతుందన్న విషయంపై సర్వత్రా చర్చనీ యాం శంగామారింది. వరంగల్, హన్మకొండ జిల్లాల డిసి సి అధ్యక్షుడిగా ప్రస్తుతం నాయిని రాజేందర్‌రెడ్డి కొన సాగుతుండగా, ఈసారి రెండుజిల్లాలకు వేర్వేరు గానే డిసిసి అధ్యక్షులను నియమిస్తారని తెలుస్తుంది. జన గామ జిల్లా డిసిసి అధ్యక్షుడిగావున్న జంగారా ఘవ రెడ్డి వచ్చేఎన్నికల్లో వరంగల్ పశ్చిమ నియోజక వర్గం నుండి పోటీ చేయనున్నట్లు ప్రకటించిన నేప థ్యంలో ఈసారి జనగామ డిసిసి అధ్యక్షుడిగా కొత్త నేతను ఎంపిక చేసే అవకాశాలున్నాయి. 'జంగా' జనగామ డిసిసి అధ్యక్ష పదవిపై అనాసక్తితో వున్నారు. దీంతో జనగామ డిసిసి అధ్యక్షపదవి విషయంలో అటు పీసీ సీ మాజీఅధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, ఇటు మా జీ ఎమ్మె ల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి వర్గాల మధ్య పోటా పోటీ నెలకొంది. వరంగల్ డిసిసి అధ్యక్ష పదవి విష యంలోనూ అటు 'కొండా' ఇటు 'దొంతి' వర్గాల మ ధ్యపోటీ నెలకొంది. ఈ వైరుధ్యాల నడుమ డిసిసి అ ధ్యక్షుల నియామకం కత్తిమీద సాములా తయారైం ది. వరంగల్ జిల్లాలో వరంగల్ తూర్పు, నర్సంపేట నియోజకవర్గాలు పూర్తిస్థాయిలోవుంటాయి. పరకాల నియోజకవర్గానికిచెందిన రెండుమండలాలున్నాయి. వరంగల్ తూర్పుకు ఇన్ఛార్జిగా మాజీ మంత్రి కొండా సురేఖ వ్యవహరిస్తుండగా, నర్సంపేటకు ఇన్ఛార్జిగా దొంతి మాధవరెడ్డి వ్యవహరిస్తున్నారు. 'కొండా'దంప తులకు, 'దొంతి'ల మధ్య తీవ్ర విభేధా లున్నాయి. వరంగల్ డిసిసి అధ్యక్షుడి నియా మకం విషయంలో ఆధిపత్యపోరుఉత్పన్నమయ్యే అవ కాశం లేకపోలేదు.
డీసీసీ అధ్యక్షుల ఎంపికపై కసరత్తు..
డీసీసీ అధ్యక్షుల ఎంపికపై టీపీసీసీ ఇప్పటికే క సరత్తు చేసింది. ప్రస్తుతం పార్టీ అధ్యక్షులు వారు చేసి న కార్యక్రమాలు, పార్టీ నేతలను కలుపుకుని పోయిన విధానంపై ఇప్పటికే ఎఐసిసికి నివేదికలు అందాయి. ఈ క్రమంలో కొత్త అధ్యక్షుల నియామకానికి రంగం సిద్ధమైంది. హన్మకొండ డిసిసి అధ్యక్షుడిగా నాయిని రాజేందర్‌రెడ్డిని కొనసాగించే అవకాశమున్నట్లు ప్రచా రం జరుగుతుంది. ఇదిలావుంటే ములుగు డిసిసి అ ధ్యక్షుడు నల్లెల కుమారస్వామి అనారోగ్య పరిస్థితుల రీత్యా మరొకరికి ఛాన్స్ రావచ్చు.
జనగామ డీసీసీ అధ్యక్షుడిగా 'కొమ్మూరి'
జనగామ డిసిసి అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే కొ మ్మూరి ప్రతాప్‌రెడ్డిని నియమించే అవకాశాలున్న ట్లు ప్రచారం జరుగుతుంది. టిపిసిసి అధ్యక్షుడు రేవంత ్‌రెడ్డికి సన్నిహితుడిగా పేరున్న 'కొమ్మూరి'కి ఈసారి అ వకాశం దక్కుతుందనే వాదనవినిపిస్తుంది. మహబూ బాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్చంద ర్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఒకవేళ 'జెన్నా రెడ్డి' ని తొలగిస్తే ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన నే తలను నియమించే అవకాశముంది. జిల్లాలోని రెండుని యోజకవర్గాలు, ఎంపి స్థానం కూడా ఎస్టీలకు రిజర్వ్ కావడంతో డిసిసి అధ్యక్ష పదవిని ఓసీలకే ఇవ్వాలన్న వాదన కూడా వుండడంతో'జెన్నారెడ్డి'నే కొన సాగించే అవకాశం లేకపోలేదు. భూపాలపల్లి జిల్లాకు రేవంత్ రెడ్డికి సన్నిహితుడైన గండ్ర స త్యనారాయణరావు ను నియమించే అవకాశాలున్నాయి.