Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేరం చేసిన వారిని వదిలేదే లేదు..
- దోషులకు శిక్షలు తప్పవు
- వరంగల్ జిల్లా కోర్ట్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్
- ప్రాసిక్యూషన్ మోకీల సత్యనారాయణ
నవతెలంగాణ-వరంగల్
సమాజంలో ఎంతోమంది ఉన్నప్పటికీ తమకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ సమాజం హితం కోసం అలుపెరుగక వత్తి ధర్మంగా పాటించే వారు కొందరు మాత్రమే ఉంటారు. ఇదే కోవలో న్యాయ వ్యవస్థలో సత్యం వైపు తీర్పునివ్వడంలో ఆయన ఒక ప్రత్యేకతను చాటుకున్నారు. ఏ వర్గాలకు చెందిన బాధితులకు అన్యాయం జరిగినా వారి వైపు వాదిస్తూ దోషులకు శిక్షలు పడేలా ఎన్నో కేసులు వాదించారు. తెలంగాణ రాష్ట్రంలో సంచలనమైన కేసులను వాధించి దోషులకు శిక్షలు పడేలా చేసి అనేక కేసుల్లో అలవోకగా విజయాలు సాధించారు. ఆయన... 'వరంగల్ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ మోకిల సత్యనారాయణగౌడ్'. ఆయనను నవతెలంగాణ ఆదివారం పలకిరించగా అనేక విషయాలు వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
నవ తెలంగాణ : మీ కుటుంబ నేపథ్యం, విద్యాభ్యాసం ?
పబ్లిక్ ప్రాసిక్యూషన్: మాది మధ్యతరగతి కుటుంబం, తల్లిదండ్రులు యాదమ్మ - రామయ్య, తండ్రి గీత కార్మికుడు. రోజంతా పని చేస్తే వచ్చిన డబ్బులతో కుటుంబం గడిచేది. అమ్మ నాన్న పడిన కష్టాలను దగ్గరుండి చూసాను. కష్టం విలువ ఏంటో నాకు తెలుసు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి వరకు చదివాను. ఇంటర్మీడియట్ చేవెళ్లలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివాను. హైదరాబాద్‌లోని వివేకవర్ధిని కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి ఆతర్వాత హైదరాబాద్ లోని పగడాల రామారెడ్డి లా కళాశాలలో 1999- 2002 వరకు లా చదివాను. అనంతరం హైకోర్టు క్రిమినల్ కోర్ట్ నాంపల్లిలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశాను.
నవతెలంగాణ : మీ మొదటి ఉద్యోగ ప్రస్తావన ?
పబ్లిక్ ప్రాసిక్యూషన్ : 2013లో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఏపీ నుండి పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియామకాల నోటి ఫికేషన్ వచ్చింది. దానిలో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా దరఖాస్తు చేశాను. 2013లో వచ్చిన ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో నాలుగో ర్యాంకు సాధించాను. 2017లో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా సూర్యాపేట కోర్టులో మొదటి పోస్టింగ్ వచ్చింది. నల్గొండ సూర్యపేట కోర్టులో 2018 డిసెంబర్ వరకు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పని చేసాను.
నవతెలంగాణ : ఇప్పటి వరకు సంచలనమైన కేసులేమైనా
ఉన్నాయా ? ఉంటే ఇందులో మీరు వాధించినవి ?
పబ్లిక్ ప్రాసిక్యూటర్ : ఉద్యోగ ప్రస్థానం నుండి ఇప్పటివరకు చాలా కేసులకు శిక్షలు పడేలా వాదించాను. రాష్ట్రంలో సంచలనమైన కేసులలో 26 మరణశిక్షలు పడేలా కేసులు వాదించాను. రాష్ట్రస్థాయిలో సంచలనం సష్టించిన ప్రణరు హత్య కేసులో బాధితురాలు అమత తరపున పీపీగా ఉండి నిందితుడికి బేల్ రాకుండా వాదిం చాను. ఆ తర్వాత పదోన్నతిపై 2018 డిసెంబర్లో డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ పదోన్నతి సాధించాను. అదేవిధంగా 2019 జరిగిన తొమ్మిది నెలల పాపపై లైంగిక దాడి హత్య కేసులో ఫోక్సోకోర్టులో పీపీగా వాదించి 48 రోజుల్లో నిందితుడికి ఉరిశిక్ష పడేలా వాదించాను.
నవతెలంగాణ : ఇప్పటి వరకు మీకు వచ్చిన
గుర్తింపు, ప్రశంసల గురించి ?
పబ్లిక్ ప్రాసిక్యూషన్: ఏడు సంవత్సరాలలో 16 సార్లు ప్రశంసా పత్రాలు అందుకున్నాను. ప్రముఖులైనా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్, డిజిపి నుంచి ప్రశంసా పత్రాలను అందుకున్నాను. ఇప్పటివరకు ఏ ఒక్క కేసులో ఓడిపోలేదు.
నవతెలంగాణ : చట్టాలపై నిర్వహించే
అవగాహన కార్యక్రమాల గురించి ?
పబ్లిక్ ప్రాసిక్యూషన్: దోషులకు శిక్షలు పడేవిధంగా వాదిస్తూనే గ్రామాలలో కూడా వెళ్లి ప్రజలకు చట్టాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. పోలిస్ అధికారులకు, ప్రాసిక్యూటర్లకు నేర పరిశోధన పై అవగాహన కల్పించేందుకు శిక్షణ తరగతుల్లో అవగాహన కల్పిస్తున్నాను.
నవతెలంగాణ : కోర్టులకు వస్తే పేదవారికి న్యాయం
జరుగుతుందా, ప్రస్తుతం చట్టాల పరిస్థితి ఏంటి ?
పబ్లిక్ ప్రాసిక్యూషన్: చట్టం ముందు అందరూ సమానులే పేదవారికి అన్యాయం జరిగితే కోర్టును ఆశ్రయిస్తే ప్రైవేటుగా న్యాయవాదిని పెట్టి వారి తరఫున కేసును వాదించేటట్లు ఏర్పాటు చేస్తాం. అలాగే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో చట్టాలు బలంగా ఉన్నాయి. నేరం చేసిన దో షి ధనవంతుడైన పేదవారైనా చట్టం ముందు అందరూ సమానులే దోషులు ఎవరైనా నేరమును బట్టి శిక్షలు ఉంటాయి.
నవతెలంగాణ : ఎస్సీ ఎస్టీ కేసులు కొన్ని
నిర్వీర్యమవుతున్నాయెందుకు ?
పబ్లిక్ ప్రాసిక్యూషన్: ఎస్సీ, ఎస్టి వర్గాలకు చెందిన వారి భూములను ఆక్రమించుకున్నా.. వారిని కులం పేరుతో దూషించినా స్థానిక పోలిస్స్టేషన్లో కేసు పెట్టి డీఎస్పి, ఏసీపీ క్యాడర్‌తో పరిశీలించి చార్జిషీట్ వేయాలి. కోర్టులో ఇద్దరు సాక్షులు వచ్చి కులం పేరుతో దూషించారని సాక్ష్యం చెబితే దోషులకు శిక్ష తప్పకుండా పడుతుంది.