Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి
నవతెలంగాణ-హన్మకొండ
ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ వెంటనే ప్రకటించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి డిమాండ్ చేశారు. ఆదివారం హన్మకొండ హంటర్ రోడ్ లోని యూటీఎఫ్ భవన్లో జిల్లా అధ్యక్షుడు రవీందర్ రాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ సమస్యల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తోం దన్నారు. ఉపాధ్యాయులకు ఏడు సంవత్సరాలు నుంచి పదోన్నతులు లేవని, నాలుగు సంవత్సరాల నుంచి బదిలీలు లేవని వాపోయారు. సబ్జెక్టు టీచర్లు లేక ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు నష్టపో తున్నా రని అన్నారు. పండిట్ , పీఈటీలకు అప్‌గ్రేడేషన్ అమలుచేయాలన్నారు. కేజీబీవీ ఉపాధ్యాయులకు బేసిక్ పే ఇవ్వాలని, మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలన్నారు. జీఓ 317 వల్ల నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయా లని, అప్పిల్స్‌ను సత్వరమే పరిష్కరించాలని డిమాం డ్ చేశారు. గురుకుల పాఠశాలలో కేర్ టేకర్ ను నియమించాలని కోరారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ 33 జిల్లాల్లో ప్రచార జాత నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1970 ప్రధానోపాధ్యాయుల పోస్టులు, 7,000 పైగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ,2024 పిఎస్ హెచ్ఎం పోస్టులు, పర్యవేక్షణ అధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. 33 జిల్లాల్లో కేవలం ఐదుగురు మాత్రమే రెగ్యులర్ డీఈవోలు ఉన్నారని, 62 డిప్యూటీ ఈవో పోస్టుల్లో 58 మాత్రమే రెగ్యులర్ వాళ్ళు ఉన్నారని అన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే సోమశేఖర్ మాట్లాడుతూ పాఠశాలల్లో సర్వీస్ పర్సన్ నియమించాలని, ప్రధానో పాధ్యాయులకు నిధులు విడుదల చేయాలని అన్నా రు. పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమానికి, తెలుగు మా ధ్యమానికి ఉపాధ్యాయులు వేరువేరుగా ఉండాలని అన్నారు. ప్రాథమిక పాఠశాలలో ఎఫ్ఎల్ఎన్ వల్ల అమలులో ఉపాధ్యాయుల అనేక ఇబ్బందులు పడు తున్నారన్నారు. టాస్క్ ఫోర్స్‌లు పెట్టి ఉపాధ్యా యులను మానసికంగా ఇబ్బందులు పెట్టొద్దన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కే రంజిత్ కుమార్, ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ అధ్యక్షులు ఎస్ సదానంద్, హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పెండెం రాజు, వాయిస్ ఆఫ్ తెలంగాణ టీచర్ పత్రిక సంపాదకవర్గ రాష్ట్ర కమిటీ సభ్యురాలు ఎ విద్యాదేవి, జిల్లా ఉపాధ్యక్షుడు సదాశివరెడ్డి, కోశాధికారి డి కిరణ్ కుమార్, ఎస్ జ్యోతి , కోశాధికారి డి కిరణ్‌కుమార్, వరంగల్ జిల్లా అధ్యక్ష ప్రధాన, కార్యదర్శులు తాటికాయల కుమార్, బద్దం వెంకటరెడ్డి, భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు రఘుపతి రెడ్డి,జిల్లా కార్యదర్శులు సిఎస్ఆర్ మల్లిక్, మోజెస్, కే శశిధర్ రెడ్డి, పి చంద్రయ్య, స్టాలిన్ బేగ్, డి నవీన్ కుమార్, ఎస్ జ్యోతి, ఆడిట్ కమిటీ కన్వీనర్ కే సదానందంతోపాటు సభ్యులు ప్రసన్నానంద్, శ్రీనివాస్, భాస్కరరావు ,గురుకుల పాఠశాల నుంచి రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎల్లయ్య పాల్గొన్నారు.