Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభివృద్ధికి 1000 కోట్లకు పైగా భారీగా నిధులు..
- కేసీఆర్, కేటీఆర్ సహకారంతో ముందుకు..
- భూపాలపల్లి పట్టణంలో నాలుగు లైన్ల రోడ్లు.. సెంట్రల్ లైటింగ్ సిస్టం
- సింగరేణి కార్మికులకు రూ.200 కోట్లతో కొత్త క్వార్టర్లు ..
- ఆయిల్ ఫామ్ సాగుతో రైతులకు అధిక లాభాలు..
- జీఎంఆర్ఎం ట్రస్ట్ ద్వారా సేవ కార్యక్రమాలు....
- నవ తెలంగాణ'తో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
నవతెలంగాణ-భూపాలపల్లి
ప్రజాసేవే ప్రధాన లక్ష్యమని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో భూపాలపల్లి ప్రగతి పథంలో దూసుకుపోతోందని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ వల్ల భారీగా నిధులు మంజూరయ్యాయని వివరించారు. జిల్లా అభివృద్ధికి అధికారులు బాగా కృషి చేస్తున్నారని అన్నారు. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజ్ తో పాటు నాలుగు లైన్ల రోడ్డు, వంద పడకల ఆసుపత్రి లో మౌలిక వసతులు, మెరుగైన విద్యకు ప్రత్యేక నిధులు మంజూరయ్యాయని, అదేవిధంగా జిల్లాలోని నిరుద్యోగ యువతి, యువకులకు జిఎంఆర్ఎం ట్రస్టు ద్వారా ఉచిత శిక్షణ అంది స్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా భూపాలపల్లి అభివృద్ధిని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి నవతెలంగాణకు ప్రత్యేకంగా వివరించారు. ఆయన మాటల ల్లోనే..' జిల్లాలో ప్రధాన రహదారుల్లో సెంట్రల్ లైటింగ్, జంక్షన్లలో హైమాస్ట్ లైట్లు, వీధుల్లో ఎల్ ఈడీ లైట్లను ఏర్పాటు చేశాం. మండల కేంద్రాల్లో రోడ్లు, డ్రైనేజీ పనులను పూర్తి చేశాం. హరితహారంలో 4 లక్షల మొక్కలు నాటించాం. 178 వైకుంఠ ధామాలు పూర్తి చేయించాం. 263 గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాల ను, 137 సెగ్రిగేషన్ షెడ్లు, 185 డంపింగ్ యార్డుల నిర్మాణాలు పూర్తి అయ్యాయి. అదేవిధంగా జిల్లాను గుడుంబా రహితంగా మార్చేందుకు కృషి చేస్తు న్నాం. పునరావాస పథకం కింద తయారీదారులకు రూ.3 కోట్ల 38 లక్షల నగదు అందించాం. నీతి అయోగ్ సహకారంతో విద్యా, వైద్యం, పౌష్టికాహారం, మౌళిక వసతులు కల్పన, నైపుణ్య శిక్షణ, వ్యవసాయం, దాని అనుబంధ రంగాల అభివృద్ధి కి చర్యలు తీసుకున్నాం. గణప సముద్రం, బీమ్ ఘన్పూర్ చెరువులను పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచి నీటి నిల్వ సామర్ధ్యాన్ని పెంచాం. జిల్లాలో రూ.412 కోట్లతో రహదారులు, వంతెనలు, భవన నిర్మాణాలు చేపట్టాం. పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. 35 రైతు వేదికలు, 616 కల్లాల నిర్మాణాలు పూర్తి చేయించాం. పట్టణ అభివృద్ధి కోసం రూ.52.46 కోట్లు వెచ్చించాం. ఉర్దూఘర్, షాదీఖానా నిర్మాణానికి రూ.75 లక్షలు, 10 చర్చీల ప్రహారీ నిర్మాణాల కు రూ.80 లక్షలు మంజూరు అయ్యాయి. నియోజకవర్గంలో రూ.281 కోట్లతో 80 అదనపు ట్రాన్స్ ఫార్మర్లకు మంజూరయ్యాయి. విద్యుత్ సమస్య లేదు. బస్ డిపో నిర్మాణంతో పాటు, పాలిటెక్నిక్, డిగ్రీ, జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయించాం. గత ఏడాది రైతు బంధు పథకం కింద రైతాంగానికి రూ.111.08 కోట్ల ఆర్థికసాయం అందించాం. రైతు బీమా ద్వారా బాధిత కుటుంబాలకు రూ. 28.50 కోట్ల పరిహారం ఇప్పించాం. కళ్యాణలక్ష్మి పథకం కింద జిల్లాలోని 7874 మంది లబ్ధిదారులకు రూ. 64 కోట్ల 53 లక్షలు, షాదీ ముబారక్ పథకం కింద 335 మందికి రూ.2 కోట్ల 66 లక్షలు అందించాం. 29,779 మంది గర్భిణులకు కేసీఆర్ కిట్‌తో పాటు, రూ.8 కోట 50 లక్షల నగదును అందజేశాం. భూపంపిణీ కార్యక్రమం కింద 133 ఎస్సీ లబ్దిదారులకు రూ.18.90 కోట్ల విలువైన 387 ఎకరాల భూమిని పంపిణీ చేశాం. ఆసరా పథకంలో 51766 మంది వృద్ధులు, వితంతువులు, నేత, గీత, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు పింఛన్ అందుకుం టున్నారు. అర్హులైన లబ్ధిదారులకు త్వరలోనే డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేయనున్నాం. రూ.10.15 కోట్లతో చేపలు పట్టు పరికరాలు, విక్రయ వాహనాల ను మత్స్య కారులకు అందజేశాం. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ, పథకాల వల్ల ప్రగతి కాంతులు విరబూస్తున్నాయి' అని అన్నారు. ముఖ్యంగా పల్లె, పట్టణ ప్రగతితో ఐదేండ్లలోనే గ్రామాల రూపురేఖలు మారిపోయాయని గండ్ర వెంకటరమణారెడ్డి వివరించారు.
వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత...
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్మించిన వంద పడకల దవాఖానలో కార్పొ రేట్ స్థాయి వైద్యం అందుతున్నది. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ఎనిమిది నెలల్లో 807 ప్రసవాలు జరిగాయి. పుట్టిన పిల్లల కోసం ఫొటో థెరపీ యంత్రాలు, అత్యా ధునిక ఐసీయూ యూనిట్ ఉంది. రూ.1.25 కోట్లతో నిర్మిస్తున్న కొత్త డయాగ స్టిక్ హబ్ త్వరలో పూర్తి కానుంది. రూ.16.60 లక్షలతో ఆర్ పీసీఆర్ ల్యాబొరేట రీ, రూ.54 లక్షలతో 20 పడకల పిల్లలు ప్రత్యేక సంరక్షణ విభాగం. రూ. 3.65 లక్షలతో ఎస్సీడీ క్లినిక్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి.
సెంట్రల్ లైటింగ్ వెలుగులు..
భూపాలపల్లి పట్టణం రాత్రి వేళలో మిరుమిట్లు గొలిపే కాంతులతో వెలిగి పోనున్నది. ఇందుకోసం జిల్లాకేంద్రం నుంచి చెల్పూర్ వరకు రూ.75 కోట్లతో నాలుగు లైన్ల రహదారితో పాటు సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటుకానున్నది. అలాగే గణేశా చౌక్ రాజీవ్ విగ్రహం నుంచి సెగ్గంపల్లి వరకు రూ.10 కోట్లతో డబుల్ రోడ్డు, జీఎం కార్యాలయం నుంచి ఓసీపీ-2 వరకు డబుల్' రోడ్డు, సెంట్ర ల్ లైటింగ్ సిస్టం అందుబాటులోకి రానున్నది. వీధి వ్యాపారుల కోసం ప్రత్యేక షెడ్లు అందుబాటులోకి రానున్నాయి.
ఇండోర్ స్టేడియం ఓపెన్ జిమ్‌లు...
జిల్లా కేంద్రంలో ఉన్న సింగరేణికి చెందిన అంబేద్కర్ స్టేడియం, ఆచార్య జయశంకర్ స్మారక పార్కు, ఎకో పార్కు, రూ.4.5 కోట్లతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ ఫూల్ నిర్మాణం కానున్నాయి. వాటికి సంబందించిన టెండర్ల ప్రక్రియ దాదాపు పూర్తయిందని గండ్ర తెలిపారు.
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి....
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కషి చేస్తున్నట్లు గండ్ర తెలిపారు. 1,175 మంది సింగరేణి కార్మికులకు పైసా ఖర్చు లేకుండా నివాసం ఉంటున్న భూములను ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చింది. అలాగే రూ.185 కోట్లతో అదనంగా మరో వెయ్యి క్వార్టర్సు నిర్మిస్తున్నాం.
6615 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యం..
రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభివృద్ధికి విశేష కషి చేస్తుందని, ఆయిల్ పామ్ సాగు ఎంతో లాభదాయకం గండ్ర అన్నారు. జిల్లాలో 2022-23 సంవత్సరానికి 6615 ఎకరాల్లో 3 లక్షల 96 వేల 900 మొక్కలు పెంచుట లక్ష్యం కాగా, ఇప్పటి వరకు దాదాపు 298 రైతులకు సంబంధించిన 963 ఎకరాలలో మొక్కలు నాటడం జరిగింది. 453 ఎకరాలలో డ్రిప్ ఇరిగేషన్ సిస్టం ఏర్పాటు చేశాం.
జీఎంఆర్ఎం ట్రస్ట్ సేవలతో సంతృప్తి....
నిరుపేద కుటుంబాలకు ప్రత్యేక్షంగా, పరోక్షంగా సేవలందించడం, ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఏర్పాటు చేసిన జిఎంఆర్ఎం ట్రస్ట్ ద్వారా ఎందరి కో సేవలందించడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి హర్షం వ్యక్తంచేశారు. జిఎంఆర్ఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా డ్రైవింగ్ శిక్షణ పొందిన 500 మంది నిరుద్యోగ యువతకు సర్టిఫికెట్లు అందించడం జరిగిం దన్నారు. సీఎం కేసీఆర్ ఉద్యోగ ప్రకటన చేసిన క్రమంలో నియోజకవర్గ పరిధి లోని దాదాపు 1200 మంది విద్యార్థులకు ఉచితంగా ట్రస్ట్ ద్వారా టెట్, గ్రూప్స్, ఎస్సై కానిస్టేబుల్ ఇలా శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ట్రస్ట్ ద్వారా విద్యను అభ్యసించిన నిరుద్యోగుల్లో 60శాతం ఉత్తీర్ణతతో విద్యార్థులు నెగ్గడం పట్ల చాలా సంతోషం కలిగిందన్నారు. జీఎంఆర్ఎం ట్రస్ట్ ద్వారా నియో జకవర్గ ప్రజలకు ఆపద్బాంధవునిగా 108 వాహనాన్ని, భూపాలపల్లి మున్సిపాలి టీ పరిధికి వైకుంఠ రథాన్ని అందించడం జరిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో టిఆర్ ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని.. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో భూపాలపల్లి ఊహకందని రీతిలో అభివృద్ధి జరుగుతుందని అన్నా రు. ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధికి పాటుపడతానని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి తెలిపారు.