Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-టేకుమట్ల
సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ వర్టికల్ ఇ న్చార్జి హర్షిత రెడ్డి అన్నారు. మండలంలోని రాఘవరెడ్డి పేట గ్రామంలో సోమ వారం స్థానిక ఎస్సై చల్ల రాజు సైబర్ నేరాలు, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ పై స్థానిక పోలీసులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా హర్షిత రెడ్డి మాట్లాడుతూ ఆన్లైన్ లోన్ ఆప్స్, వర్క్ ఫ్రమ్ హౌమ్ జాబ్స్ అంటూ సెల్ ఫోన్లో వచ్చే మెసేజ్లను ఓకే చేయకూడదని, ఫోన్లకు వచ్చేతెలియని లింకులను క్లిక్ చేయడం వల్ల డేటా మొత్తం సైబర్ నేరస్తులకు తెలిసిపోవడం జరుగు తుంద న్నారు. సైబర్ మోసాలపై 1930 నెంబర్కి, కాల్ చేసి సమాచారం ఇవ్వాలని ప్రతీ ఒక్కరూ ఎంసిఆర్పి పోర్టల్లో రిజిస్టర్ చేసుకొని పోలీసుల సహాయ సహ కారాలు తీసుకోవాలని విద్యార్థులకు, యువకులకు, గ్రామ ప్రజలకు పలు సలహా లు సూచనలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ ఇంతియాజ్, హెడ్ కాని స్టేబుల్ చంద్రశేఖర్, కానిస్టేబుల్ మహేందర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.