Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని బుస్సాపురం గ్రామంలో నెలకొన్న సమస్యలపై సోమవారం ఐటీడీఏ ఏపీవో వసంత రావుకు వినతిపత్రం అందించినట్లు సర్పంచ్ సింగం శ్రీలత చంద్రయ్యలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీలత మీడియాతో మాట్లాడుతూ గ్రామంలో గతంలో ఇచ్చిన ఇండ్ల ప్లాట్లలో ట్రైబల్స్ కు సంబం ధించిన కొంతమందికి రిజిస్ట్రేషన్ ఆగిపోవడం జరిగిందని ఆ విషయమై వెంటనే పరిష్కరించాలని కోరి నట్లు తెలిపారు. అంతేకాక గ్రామంలో నిత్యావసర వస్తువుల సరఫరా రేషన్ డీలర్ షిప్ ట్రైబల్ వికలాం గులకు కేటాయించాల్సి ఉండగా ఇప్పటి వరకు నాన్ ట్రైబల్స్ ఈ డీలర్ షిప్ను నిర్వహిస్తున్నారు. అర్హులై న వికలాంగ ట్రైబల్స్కు ఈ డీలర్ షిప్ను అందించాలని గిరిజన యువకులు పలుమార్లు కోరడం జరిగిం దని అన్నారు. గ్రామంలో అంగన్వాడీ టీచర్ లేకపోవడం వల్ల అంగన్వాడీ సెంటర్ నిర్వహణ అస్తవ్యస్తం గా మారిందని అన్నారు. అంగన్వాడీ టీచర్ ఖాలిని వెంటనే భర్తీ చేసి గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు న్యాయం జరిగే విధంగా సహకరించాలని కోరినట్లు తెలిపారు. అదేవిధంగా గ్రామంలో ఆర్ఓఎఫ్ఆర్ కార్యక్రమం లో భాగంగా సుమారు 160 మంది పోడు సాగుదారులు వీరిలో వందకు పైగా ట్రైబల్ సాగుదారులు దరఖాస్తు చేసుకోవడం జరిగిందని ఏ ఒక్కరికి కూడా అర్హులుగా అటవీశాఖ ప్రకటించక పోవడం దుర దృష్టకరమని అన్నారు.అంతేకాక గతంలో ఇచ్చిన 35 మందికి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఉన్నప్పటికీ వాటిని కూడా రిజెక్ట్ చేస్తున్నామంటూ అటవీ అధికారులు సమావేశంలో చెప్పడం జరిగిందన్నారు. లక్నవరం టూరిజం పర్యాటక కేంద్రం ఈ ఏరియాలో ప్రసిద్ధి చెందిందని పారిశద్ధ్య నివారణ కొరకు అనేక రకాల చర్యలు చేపడుతున్నామని, పార్కింగ్ సౌకర్యం కోసం స్థలాన్ని కేటాయించాలని అధికారులను కోరడం జరిగిందన్నారు. విద్యార్థి సమస్యలపై ఐటీడీఏ పీిఓ గారు వెంటనే సంబంధించి గ్రామ అభివద్ధి కోసం సహకరించాలని కోరినట్లు తెలిపారు.