Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కెనరా బ్యాంక్ మేనేజర్ జి.పూర్ణచందర్రావు
నవతెలంగాణ-గోవిందరావుపేట
నేడు మండలంలోని పసర గ్రామంలో పీఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో మహిళా సంఘాల సభ్యులకు అవగాహన సదస్సును నిర్వహిస్తున్నట్లు కెనరా బ్యాంక్ పసర బ్రాంచ్ మేనేజర్ జి.పూర్ణ చంద్రరావు అన్నారు. సోమవారం కెనరా బ్యాంకు పసర బ్రాంచ్ కార్యాలయంలో మేనేజర్ పూర్ణచందర్ మీడియాతో మాట్లాడా రు. మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా అభివద్ధి జరుగుతున్న క్రమంలో భాగంగా ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక అభివద్ధి కై మహి ళా సంఘాల సభ్యులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ట్లు తెలిపారు. పొదుపు, రుణాల సద్వినియోగం, సకాలంలో చెల్లింపులు, బ్యాంకు సేవలు తదితర అంశాలపై మహిళా సం ఘాల సభ్యులకు పూర్తి అవగాహన కల్పిం చనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిఆర్డిఏ నుండి నాగ పద్మజ, కెనరా బ్యాం కు వరంగల్ శాఖ ఏజీఎం మాధవి తదితరులు హాజరై మహి ళా సంఘాల సభ్యులకు అనేక అంశాలపై అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమాన్ని మహిళా సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకోవా లని సూచించారు. కార్యక్రమంలో బ్యాంకు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.