Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వాజేడు
మిషన్ భగీరథ సర ఫరా చేసే మంచినీరు ఇం టింటికీ ఒకటి రెండు బిం దెల నీరు రావడం వల్ల మంచినీటి కొరత ఏర్పడి తీవ్ర ఇబ్బందులకు గురవు తున్నామని వాజేడు నాగా రం, జంగాలపల్లి గ్రామాల మహిళలు ఆందోళనకు దిగారు. వాజేడు మండలం తహసిల్దార్, మండల పరిషత్ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో మిషన్ భగీరథ నీళ్లు వద్దు... నళ్ళా నీరే ముద్దు... అంటూ నినాదాలు చేస్తూ మహిళలు ఖాళీ బిందెలతో ఆందోళన చేపట్టారు. మిషన్ భగీరథ నీరు తాగటం వల్ల కడుపు, గుండె, మోకాళ్ళ నొప్పులు, వివిధ అనారోగ్య సమస్యలు వస్తున్నాయ ని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ మోటార్ల ద్వారా తాగునీటిని అందించా లని తహసిల్దార్ సర్వర్ పాషా మండల పరిషత్ అధికారి విజయకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాకర్లపూడి విక్రాంత్, నాగారం సర్పంచ్ తల్లడి ఆదినారాయణ, సొసైటీ ఉపాధ్యక్షులు జగన్నాథరాజు, కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు ఖాజావలి, మహిళలు పాల్గొన్నారు.