Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
బాధితుల ఫిర్యాదులపై విచారణ జరిపి, పోలీసులు తీసుకుంటున్న చర్యలు, కేసు విచారణలో వాస్తవాలను, ఫిర్యాదు దారులకు వివరించడంతో పాటు వారికి సత్వర న్యాయం అందించేందుకు జిల్లా పోలీస్ అధికారులు కృషి చేయాలని జిల్లా ఎస్పి జె. సురేందర్ రెడ్డి అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజాదివాస్ కార్యక్రమం సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహిం చడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఫిర్యాదుదారులకు, బాధితులకు, పారదర్శకంగా సేవలు అందించాలని, వాస్తవ పరిస్థితులను పరిశీలించి త్వరిత గతి న సమస్య పరిష్కారానికి కృషి చేయాలని పోలీస్ అధికా రు లను ఆదేశించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 15 మంది ఫిర్యాదుదారులతో ఎస్పి మాట్లాడి వారి సమస్యలకు గల కారణాలు నేరుగా అడిగి తెలుసుకున్నారు. ప్రతీ ఫిర్యాదుపై క్షేత్రస్ధాయిలో విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రజాదివాస్ కార్యక్రమంలో అధికంగా భూ వివాదాలు, కుటుంబ, వ్యక్తిగత సమస్యలతో పాటు ఆర్థ్ధిక లావాదేవీలకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయి.