Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి కార్య క్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ యస్ కృష్ణ ఆదిత్య తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం లో జిల్లా కలెక్టర్ఎస్.కృష్ణఆదిత్య, అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వైవి గణేష్తో కలసి నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో (71 ) ధరఖాస్తులను స్వీకరించడం జరిగిందని, వివిధ శాఖలకు సంబంధించిన సమస్యలతో జిల్లా కేంద్రంతో పా టు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఎన్నో వ్యయ ప్రయాలకు ఓర్చి వస్తారని, కాబట్టి అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహ రించడంతో పాటు వాటి పరిష్కారానికి ప్రాదాన్యతను ఇవ్వా లని అధికారులను ఆదేశించారు.ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని, తిరస్క రించిన పక్షంలో తిరస్కరణకు గల కారణాలను వివరంగా తెలుపుతూ అర్జీదారునికి అందజేయాలని అధికారులకు కలె క్టర్ సూచించారు. ఈరోజు మొత్తం (71 )ధరఖాస్తులు రాగా భూ సంభందిత రెవెన్యూ సమస్యలు(44), ఇతర శాఖలకు సంబంధించి (27) అర్జీలు వచ్చాయి. ఈ ప్రజావాణి కార్య క్రమంలో సిపిఓ ప్రకాష్, డిఎంహెచ్ఓ అప్పయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తులా రవి, డిపిఓ వెంకయ్య, ఎస్సీ వెల్ఫేర్ అధికారి భాగ్యలక్ష్మి, బీసీ వెల్ఫేర్ అధికారి లక్ష్మణ్, ఈ ఈ ఆర్ అండ్ బి వెంకటేశ్వర్లు, జెడ్పిసిఇఓ ప్రసన్నారాణి, డిసి సర్దార్ సింగ్, జిల్లా వ్యవసాయ అధికారి గౌస్ హైదర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.