Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ వై.వెంకయ్య
నవతెలంగాణ-హనుమకొండ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా రంగంలో తీసు కొస్తున్న నూతన సంస్కరణలకు వ్యతిరేకంగా ఉద్య మించాలని ప్రొఫెసర్ వై.వెంకయ్య పిలుపునిచ్చారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్ యూ ఉమ్మడి వరంగల్ 22వ మహాసభ సోమవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగింది. పీడీఎస్ యూ గ్రేటర్ వరంగల్ నగర అధ్యక్షులు బాషబోయి న వేణురాజ్, అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ప్రొఫెసర్ వై.వెంకయ్య హాజరయ్యా రు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం విద్యారం గంలో నూతనసంస్కరణ లు తీసుకొచ్చి విద్యార్థులకు అన్యాయంచేస్తుందని అ న్నారు. శాస్త్ర సాంకేతికరం గాల్లో పురోగమిస్తున్న భార తదేశాన్ని తిరోగమనానికి తీసుకెళ్తూ, కుల మత ఉన్మా దాన్ని పెంచి సమాజాన్ని నిలువుగా చీల్చే కుట్ర చే స్తోందన్నారు. హిందు మతోన్మాదంతో సమాజ విచ్ఛి న్నానికి పూనుకుంటూ ప్రజల ఆట పాట మాట తినే తిండిపై ఆంక్షలు విధిస్తూ తన పాశవిక దమనకాండ కొనసాగిస్తోంది అన్నారు.
నూతన విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయకపో గా ఉన్న యూనివర్సిటీల్లో రీసెర్చ్సెంటర్లు ఒక్కటి కూ డా నూతనంగా ఏర్పాటు చేయకుండా విద్యార్థుల కు న్యాయబద్దంగా అందించాల్సిన ఫెలోషిప్ స్కాలర్ షి ప్స్ లో కోత విధిస్తున్నారు బడ్జెట్ లో విద్యారంగానికి నిధులు కేటాయింపులులేక విద్యావ్యవస్థ నిర్వీర్య మైం దన్నారు. రాష్ట్రంలో విద్య పేదవాడికి అందని ద్రాక్షగా మారిందని, ప్రతిష్టాత్మకమైన తెలంగాణలోని 11 ప్ర భుత్వ యూనివర్సిటీలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యపరి చిందన్నారు. విద్యారంగంలో వస్తున్న మార్పులో భా గంగా ప్రైవేట్ యూనివర్సిటీలు తీసుకొస్తూ ప్రవేట్ వి ద్యావిధానాన్ని పెంచి పోషిస్తుందన్నారు. కావున ప్రగ తిశీల శక్తులుగా విద్యార్థిఅమరవీరుల స్ఫూర్తితో వి ద్యా ర్థులుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న వి ద్యా, ప్రజావ్యతిరేక విధానాలపై శాస్త్రీయ విద్యా సాధ నకై ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ ఉమ్మడి వరంగ ల్ జిల్లా అధ్యక్షులు దుర్గం సారయ్య, కాకతీయ యూ నివర్శిటీ అధ్యక్షులు పి.మధు, నగర కార్యదర్శి రాజు, కోశాధికారి పద్వి ,భవాని,మానస, సుమలత, స్వప్న, ప్రవీణ్, అనిల్, అరుణ్, సంపత్, నిఖిల్, తదితరులు పాల్గొన్నారు.