Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
మున్సిపల్ కార్మికులు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఇతర ఉద్యోగులపై కక్ష సాధిం పు చర్యలకు పాల్పడుతున్న కమిషనర్ వెంకటస్వామి పై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని సీపీఐ (ఎం) పట్టణ కార్యదర్శి హనుమకొండ శ్రీధర్ డిమాండ్ చేశా రు. సోమవారం సీపీఐ (ఎం) కార్యాలయంలో పట్టణ కమిటీ సభ్యురాలు గుజ్జుల ఉమా అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో శ్రీధర్ మాట్లాడారు. కమిషనర్ వెంకటస్వామి కొన్నాళ్లగా మున్సిపల్ కార్మికులు, ఇతర సిబ్బంది పట్ల అనుచితంగా వ్యవహరిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. కమిషనర్ చర్యల వల్ల ఇప్పటికే కార్యాలయ సిబ్బంది సుదీర్ఘకాలం సెలవులకు, ఇతర ప్రాంతాలకు డిప్యూటేషన్లపై వెళ్లాల్సి వచ్చిందని అన్నారు. వెంటనే ఉన్నతాధికారులు కమిషనర్ పై విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టాల్సి వస్తుందని అన్నారు. సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు గుజ్జుల ఉమా, అనంతగిరి రవి, పట్టణ నాయకులు గడ్డమీది బాలకష్ణ, మండల అశోక్,గుజ్జుల వెంకన్న, నాయకులు జగన్నాధం కార్తీక్, ఎండి ఫారిదా, కలకోటి అనిల్, వజ్జంతి విజయ, బిట్ర స్వప్న ఉదయగిరి నాగమణి, లక్ష్మి,నర్సింహా రాములు తదితరులు పాల్గొన్నారు.