Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నడికూడ
అభివృద్ధి, ప్రజా సమస్యలపై చర్చించే మండల సర్వసభ్య సమావేశానికి అధికారులు గైర్హాజరు కావ డం పట్ల ఎంపీపీ, మండల ప్రజా ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో సోమ వారం ఎంపీపీ మచ్చ అనసూర్య రవీందర్ ఆధ్వర్యం లో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావే శానికి ముఖ్య అతిథులుగా ఏఎంసీ చైర్మన్ బండి సా రంగపాణి, మాదారం సొ సైటీ చైర్మన్ నల్లెల లింగ మూర్తి పాల్గొన్నారు. ప్రతి సర్వసభ్య సమావేశంలా గానే సోమవారం కూడా కొంతమంది ప్రభుత్వ అధి కారులు గైర్వాజరు అయ్యా రు. ప్రజా ప్రతినిధుల కొం తమందితోనే సమావేశం జరిగింది. సర్వసభ్య సమావేశంలో మండలానికి సం బంధించిన అభివద్ధి పనులపై చర్చలు జరిగినా పరి ష్కారం కావడం లేదని పలువురు అభిప్రాయం వ్య క్తంచేశారు. సర్వసభ్య సమావేశంలో అధికారుల వివ రణ అయిపోవడంతోనే ఎవరికి వారు వెళ్లిపోవడంతో చివరి వరకు ప్రజాప్రతినిధులతోనే సమావేశం నిర్వ హించడం జరిగింది. దీనిపై ఎంపీపీ మచ్చా అనసూ ర్య మాట్లాడుతూ సమావేశం పూర్తయ్యేవరకు ప్రతి ప్రజాప్రతినిధులు, అధికారులు తప్పకుండా ఉండాల ని గ్రామాలలోని సమస్యలకు ఎవరుసమాధానం ఇ స్తారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వ సభ్య సమావేశానికి 21 శాఖలకు 9 శాఖలు గైర్హాజరు కావడంపై మండిపడ్డారు. ప్రతి సర్వసభ్య సమావేశా నికి ప్రతిఒక్క అధికారులు, ప్రజాప్రతినిధులు సమ యానికి తప్పనిసరిగా హాజరుకావాలని అన్నారు.
ప్రతి గ్రామంలోని సమస్యలను పరిష్కరించా లని అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు. కొన్నిగ్రామాల సర్పంచ్లు గ్రామాలలోని సమస్యల పై నివేదికను అందించారు. ఇప్పటికైనా గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరా రు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ చంద కుమార స్వామి, జెడ్పిటిసి కోడేపాక సుమలత కరుణాకర్, ఎం పీడీవో రాజేంద్రప్రసాద్, ఆయా గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.