Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భీమదేవరపల్లి
భూమి వివాదంలో సర్పంచ్ జోక్యం చేసుకున్నాడంటూ మహిళా వాటర్ ట్యాంక్ ఎక్కి సోమవారం నిరసన తెలిపిన ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ముస్తఫాపూర్ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. బాధితురాలు బొక్కలఅపర్ణ తెలిపిన వివరాల ప్రకారం గ్రా మ శివారులోని సర్వే నంబర్ 200, 222లలో 2-14 ఎక రాల భూమి బొక్కల అపర్ణకు ఉన్నది. గత కొంతకాలం గా ఆ భూమిలో కొంత భాగంపై గ్రామ పంచాయతీ, మహిళకు వివాదం జరుగుతున్నది. సోమవారం ఉదయం సర్పంచ్ రొంటాల ప్రభాకర్ స్థలంవద్ద పక్కనే ఉన్న పల్లె ప్రకతి వనా న్ని పరిశీలిస్తుండగా గమనించిన రైతు అపర్ణ భర్త రవీందర్ రెడ్డి ఏమిటని అడగగా సర్పంచ్ చేయి చేసుకున్నాడని మహిళా ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్ ప్రభాకర్ ద్వారా తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని సోమవారం మధ్యా హ్నం గ్రామవాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. సమా చారం తెలుసుకున్న ముల్కనూర్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ సంఘటన వద్దకు చేరుకొని బాధిత మహిళతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడంతో మహిళా అపర్ణ వాటర్ ట్యాంక్ దిగివచ్చారు.