Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లబెల్లి
రైతు సంక్షేమమే ధ్యేయంగా మద్ద తు ధర కల్పించేందుకు ప్రభుత్వం ఏ ర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రా లను రైతులు సద్వినియోగం చేసుకో వాలని ఎంపీపీ ఉడుగుల సునీత ప్ర వీణ్గౌడ్ అన్నారు. మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పా టు చే సిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎం పీపీ ప్రారంభించి మాట్లాడుతూ రైతు లు ప్రభుత్వం కేటాయించిన కేంద్రా లలో మద్దతు ధరకు వరి ధాన్యాన్ని అ మ్ముకోవాలని తెలిపారు. ఏ గ్రేడ్ ధా న్యానికి రూ.2060లు, సాధారణ ధా న్యానికి రూ.2040లు ప్రభుత్వం మద్దతు ధర కల్పించిందని ప్రతి రైతు సెంటర్లలో ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా ఆధార్‌తో నమోదైన ఫోన్ నెంబ ర్ఉండే విధంగా చూసుకోవాల ని కో రారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గందే శ్రీలత శ్రీనివాస్ గుప్తా, పీఏసీ ఎస్ డైరెక్టర్ సత్తుపల్లి మురళీధర్, డైరె క్టర్లు బత్తిని మహేష్, కొనుకటి వీరమ ల్లు, తోట శ్రీనివాస్, ఏఎస్ఎస్టి రిజిస్ట ర్ నోడల్ ఆఫీసర్, స్థానిక ఎంపీటీసీ జన్ను జయరావు, కొండలుపల్లి సర్పం చ్ మామిండ్ల మోహన్‌రెడ్డి, సర్పంచ్ లు, ఏఈఓ శ్రీకాంత్, పిఎసిఎస్ సీఈ వో నాగెళ్ళి మొగిలి, రైతు సమన్వయ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.
ఖానాపురం : మండల కేంద్రం లోని రంగపురం, దబ్బీరి పేట, అయో ధ్యనగర్, అశోక్ నగర్, ధర్మరావుపేట, బుధరావుపేట,రాగంపేట ధాన్యం కొ నుగోలు కేంద్రాలను ఓడిసిఎంఎస్ చైర్మన్ రామస్వామి నాయక్ ఆధ్వర్యం లో ప్రారంభించారు. అనంతరం వా రు మాట్లాడుతూ రైతులు వరి ధాన్యం కొనుగోలు విషయంలో అధైర్య పడు ద్దని, రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజవరకు తెలంగాణ ప్రభు త్వం కొనుగోలు చేస్తుందని, రైతులకు అండగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నా రని అన్నారు. కెసిఆర్ ఆదేశానుసారం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆశీస్సుల తో ఖానాపురం సొసైటీని మరింత అభివృద్ధి దిశగా నడిపిస్తానని తెలిపా రు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఉమారాణి ఉపేందర్ రెడ్డి, టిఆర్ఎస్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి బండి వెంకన్న రంగపురం సర్పంచ్ నరేష్, కొ నుగోలు సెంటర్ ఇన్చార్జి బాబురావు, సర్పంచ్ కవిత, ఉపసర్పంచ్ రాము లు, వార్డు సభ్యులు సంపత్, రాంబా బు, లక్ష్మి,గోదదేవి మహిళ ఇంచార్జి బ సన బోయిన రమలు, కె వెంకటేశ్వర్లు, సర్పంచ్ శతి, పూర్ణచందర్, కె కష్ణ రెడ్డి, అల్లవుద్దిన్, జితేందర్, రాజేశ్వర్ రావు టిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు అమలి సంఘం సభ్యులు పాల్గొన్నారు.
సంగెం : మండలంలోని మొం డ్రాయి, ఎలుగూరు రంగంపేట, బిక్కో జీనాయక్తండా,నల్లబెల్లి గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ఎంపీపీ కందగట్ల కళావ తి, జెడ్పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డి ప్రా రంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ , జెడ్పీటీసీలు మాట్లాడుతూ వరి ఏ గ్రేడ్ రూ.2060లు, గ్రేడు సాధారణ రకం రూ.2040 ధరను తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందన్నా రు.మాట్లాడుతూ వరి కొనుగోలు కేం ద్రాల్లో అమ్మే రైతులు ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా పాసుబుక్ జిరాక్స్, భూ మి పట్టాపాస్‌బుక్ జిరాక్స్ తీసుకొ ని రావాలన్నారు. ఈ కార్యక్రమంలో రై తు సమన్వయ సమితి మండల అధ్య క్షులు నరహరి, వైస్ ఎంపీపీ బుక్క మ ల్లయ్య, సొసైటీ చైర్మన్ వేల్పుల కుమా రస్వామి, వైస్‌చైర్మన్ కొట్టంరాజు, స ర్పంచులు గూడ కుమారస్వామి, పోతు ల ప్రభాకర్, బానోత్ విద్యా రాణి (వం శీ), మామిడాల సుదర్శన్, ఎంపీటీసీలు జనగాం పద్మశ్రీనివాస్గౌడ్, కట్ల సుమలత నరేష్, కో-ఆప్షన్ సభ్యుడు మన్సూర్‌అలీ, టీఆర్ఎస్ నాయకు లు, రైతులు, మహిళలు పాల్గొన్నారు.