Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ
మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన రాందేవ్ బాబా మహిళలకు క్షమాపణ చెప్పాలని చేశాడన్నారు. అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బత్తుల హైమావతి డిమాండ్ చేశారు. ఐద్వాజిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జనగామ పట్టణంలో మహిళా సంఘం ఆఫీస్ నుండి నెహ్రూ పార్క్ వరకు భారీ ర్యాలీ నిర్వ హించారు. రాందేవ్ బాబా మహిళలకి క్షమాపణ చె ప్పాలని నిరసన నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బత్తుల హైమావతి పాల్గొని మాట్లాడుతూ యోగా ఆయుర్వేదం పేరిట ప్రజలను మోసం చేస్తూ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని వేలాది కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తున్న రాందేవ్ బాబా మహిళలపై అనుచిత వాక్యాలు చేయడం సిగ్గుచేటు అన్నారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బీజేపీ నేత పాడ్నవిస్ భార్య అమృత పాడినవిస్ సమక్షంలో ప్రముఖ బీజేపీ నేతల కార్యక్రమంలో ఈ మాటలు మాట్లాడినప్పటికీ ఒక్క నేత కూడా అభ్యంతరం చెప్పలేదని మండిపడ్డారు. బీజేపీ మనువాద భావ జాలాన్ని స్వాములతో ధర్మకర్తలతో మాట్లాడిస్తున్నారని అన్నారు. ఇలాంటి వారి పట్ల ఐద్వా చూస్తూ ఊరు కోదని హెచ్చరించారు. రాందేవ్ బాబా మాటల్ని సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేసి కేసులు నమోదు చేసి చర్యలు తీసు కోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు ఇర్రి అహల్య, ఉపాధ్యక్షులు పందిళ్ళ కళ్యాణి, దేవి అంజమ్మ సహాయ కార్యదర్శి చీర రజిత ఎండి షబానా ఎర్ర అనిత చింతల శ్రీలత ఎర్ర రజిత వడ్డేపల్లి సౌందర్య జయ బిట్ల లక్ష్మి సంతోష గజ్వేల్లి మానస మహిళలు పాల్గొన్నారు.