Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూరు
విద్యార్థి దశనుండే పిల్లలు శాస్త్రీయంగా ఆలో చిస్తూ తార్కిక, విచక్షణా జ్ఞానాన్ని పెంపొందిం చుకోవాలని తొర్రూర్ ఆర్డీవో రమేష్ అన్నారు. జన విజ్ఞాన వేదిక తొర్రూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక వికాస్ స్కూల్ కరెస్పాండంట్ తాళ్లపెళ్లి రమేష్ ఆర్ధిక సహకారంతో జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలను వికాస్ స్కూల్లో నిర్వ హించారు. ఈ పోటీల్లో జిల్లాలోని వివిధ మండలాల లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల నుండి 35 టీంలు పాల్గొన్నాయని, ఈ పోటీలలో ముందుగా వ్రాత పరీక్ష నిర్వహించి మెరిట్ సాధించిన 9 టీమ్లకు డయాస్ క్విజ్ నిర్వహించారు. ముందుగా రాపిడ్ రౌండ్ను స్వయంగా ప్రొఫెసర్ లక్షారెడ్డి నిర్వహించారు. అనంతరం బయోసైన్సు,ఫిజికల్ సైన్స్, జీకే ు కరెంట్ ఎఫైర్స్ రౌండ్లు నిర్వహించి అన్నింటిలో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా విజేతలకు బహు మతులు అందజేశారు. పలువురు విద్యార్థులు ప్రధమ స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్టు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు తడకమళ్ళ బ్రహ్మం, ప్రధాన కార్యదర్శి లింగంపల్లి, కార్యక్రమ సమన్వయకర్త రాయిపెల్లి యాకయ్య, జేవీవీ జిల్లా ఉపాధ్యక్షులు మైస నాగయ్య కొండం వసుందర్, మంగపతిరావు, ఆర్వి ప్రసాద్, తండ ప్రభాకర్ తాళ్లపల్లి హేమాద్రి, జేవీవీ మండలాల బాధ్యులు బయగాని రాం మోహన్,శ్రీధర్, శేషు, మైపాల్ రెడ్డి, లింగమూర్తి, బండి నరేందర్ రెడ్డి, సునిత, కార్యదర్శి యాకాంబ్రం, కోశాధికారి ఎద్దు వెంకన్న, జేవీవీ తొర్రూర్ బాధ్యులు శ్రీధర్ రెడ్డి, ముత్తిలింగం ,ఫణి తదితరులు పాల్గొన్నారు.