Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
నర్సంపేటలోనిర్మిస్తున్న జిల్లా ప్రభుత్వఆసుపత్రి నిర్మాణ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు ఎమ్మెల్యే పె ద్ది సుదర్శన్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టీ.హరీష్‌రావు జివో పత్రాన్ని ఎమ్మెల్యే కు అందజేశారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే పెద్ది సుద ర్శన్‌రెడ్డి సంతృప్తి వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్, మం త్రి హరీష్‌రావుకు కృతజ్ఞత లు చెప్పారు. నర్సంపేట లో జిల్లా ఆసుపత్రికి రూ. 58 కోట్లు విడుదల చేయ గా నిర్మాణ పనులు పురో గతి కొనసాగుతున్నాయని తెలిపారు. మరో ఆరు నెల ల్లో పనులు పూర్తి కానున్నాయన్నారు. నర్సంపేట ని యోజకవర్గ ప్రజలకు చుట్టూరా ప్రాంతాలకు చెందిన నిరుపేద ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యాన్ని అందిం చడం కోసం తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీ ఆర్ అనుమతితో మంత్రి హరీశ్ రావు సహకారంతో నర్సంపేట ప్రాంతానికి జిల్లా ఆసుపత్రి మంజూరు అయిందన్నారు. ప్రస్తుతం ఉన్న నర్సంపేట ఏరియా ఆసుపత్రిని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేస్తూ అనుమతులు కూడా జారీ చేశారని చెప్పారు. జిల్లా ఆసుపత్రి పనులు వేగవంతంగా సాగుతున్నాయన్నా రు. అదనంగా కాంపౌండ్‌వాల్, గ్రీనరీ, స్టాఫ్ క్వార్టర్, రోగుల అటెండెంట్ షేడ్, ఇంటర్నల్ సీసీ రోడ్లు ఇతర మౌలిక సదుపాయాల కోసం రూ. 10 కోట్ల నిధుల ను తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసింద న్నారు. నర్సంపేట ప్రాంతానికి పర్యటనకు వచ్చిన ఆ రోగ్యశాఖ మంత్రి టీ.హరీష్‌రావు దృష్టికి తీసికెళ్లగా సీఎం కేసీఆర్ అనుమతితో నర్సంపేట జిల్లా ఆసుప త్రికి అదనంగా మరో రూ.10 కోట్ల నిధులను విడుద ల చేశారని తెలిపారు. ఈ పనులకు త్వరలో టెండర్లు పిలువనున్నారని, మొత్తంగా మరో 6 నెలల్లో అన్ని సౌకర్యాలతో నర్సంపేట జిల్లా ఆసుపత్రిని పూర్తిస్థా యిలో నిర్మాణం చేసి ప్రజలకు వైద్య సేవలు అందు బాటులోకి తీసుకవస్తామని తెలిపారు.