Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
జిల్లాలోని ఎస్సీ,ఎస్టి అట్రాసిటీ కేసుల బాధితు లకు సత్వరన్యాయం జరిగేలా చర్యలు తీసుకోవా లని జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య అన్నారు. మంగళవా రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా షెడ్యూ ల్ కులాల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ సమావేశం జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆది త్య, ఏఎస్పి సుధీర్రామ్నాథ్కేకన్తో కలిసి నిర్వహిం చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నేరాలకు పాల్పడిన వారు ఎట్టి పరిస్థి తుల్లోనూ కేసు ల నుంచి తప్పించుకోకుండా వారికి చట్టం పరిధిలో తగిన శిక్షపడేలా చూడాలన్నారు. జిల్లా లో అండర్ ఇన్విస్టిగేషన్ కింద 14 కేసులు ఉన్నాయని, పెండింగ్ ట్రయల్ కేసులు కింద 70 కేసులు ఉన్నాయని అ న్నారు. మళ్లీ నిర్వహించే విజిలెన్స్ మానిటరింగ్ క మిటీ సమావేశం నాటికి కేసుల దర్యాప్తులో పురోగతి ఉండాలన్నారు. అట్రాసిటీ కేసులకు సంబంధించిన ఘటనలు చోటుచేసుకున్నప్పుడు బాధితులకు సరైన రీతిలో సమగ్రంగా అన్ని అంశాలతో ఫిర్యాదు చేసేల కమిటీ సభ్యులు సహకారం అందించాలని సూచిం చారు. బాధితులకు తప్పని సరిగా పూర్తిన్యాయం జరి గేలా కృషి చేస్తామన్నారు. జిల్లాలో నెలకొని ఉన్న స మస్యలను పరిష్కరిస్తూ మూఢనమ్మకాల నిర్మూల నకు ప్రజలు అవగాహన క ల్పించాలని సంబంధిత అ ధికారులను ఆదేశించారు. జిల్లాలో అంబేడ్కర్ కమ్యూ నిటీ హాలుమంజూరు కా గా వాటి నిర్మాణానికి స్థల పరిశీలనకు సంబంధిత మండలాల తహసీల్దార్లు నివేదికలు పంపుటకు సం బంధిత అధికారులకు ఆదేశించారు.మండలానికి ఒక రు చొప్పున దళితదివ్యాంగులకు దళితబంధు పథకం లో ప్రాధాన్యత కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎస్సీ కార్పొ రేషన్ ఈడీని ఆదేశించారు.ఈ సమావేశంలో విజిలె న్స్ మాటరింగ్ కమిటీ సభ్యులు జిల్లాలో కొన్ని సమ స్యలను కలెక్టర్ దష్టికి తీసుకురాగా వాటిని సానుకూ లంగా స్పందించారు.పరిష్కరించేందుకు అధికారులు సమన్వయం చేసుకొని చట్ట ప్రకారం పరిష్కరించా లని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వై వి గణేష్ ఎస్సీ వెల్ఫేర్ అధికారి పి. భాగ్యలక్ష్మి,ఎస్సి కార్పొరేషన్ ఈడీ తుల రవి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సభ్యులు నక్క బిక్షపతి జన్ను రవి చుంచు రవి రాస మల్ల సుకుమార్ మహేష్ నాయక్ తాహసిల్దారులు ఎం శ్రీనివాస్ సంజీవ రాజకుమార్, ఎం పిడిఓ ఎగ్బాల్ హుస్సేన్ సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.