Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనుమానితులకు సహకరిస్తే కఠిన చర్యలు : ఏఎస్పీ అశోక్‌కుమార్
నవతెలంగాణ-ఏటూరునాగారం ఐటిడిఏ
ములుగు జిల్లాలోని వెంకటాపురం(కె) మండలం పరిధిలోని ముత్తారం, సీతా రాంపురం వద్ద మావోయిస్టు పార్టీకి చెందిన ఆరుగురు మిలీషియా సభ్యులను అ రెస్టు చేసినట్లు ఏటూరునాగారం ఏఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. మంగళవారం ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని సర్కిల్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆరుగురు మావోయిస్టు మిలీషియా స భ్యులను అరెస్టు వివరాలను ఏఎస్పీ వెళ్లడించారు. అదే మండలం కలిపాకకు చెం దిన సీపీఐ మావోయిస్టు పార్టీ మిలీషియా సభ్యులు కుర్సం రాంబాబు, బడిసె బా లరాజు, కుంజ శంకర్, కుర్సం మల్లయ్య, గట్టుపల్లి రాంబాబు, కోరం సత్యంలను అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరంతా సోమవారం సాయంత్రం అనుమానా స్పందంగా కనబడడంతో వెంకటాపురం పోలీసులు అరెస్టు చేశారన్నారు. పీఎల్జీ ఏ వారోత్సవాలకు సంబంధించిన కరపత్రాలు,వాల్‌పోస్టర్లను మండలంలోని ప్రధాన రోడ్లపై వేసేందుకు వచ్చారన్నారు. 2018 నుంచి నిషేదిత మావోయిస్టు పార్టీకి సానుభూతిపరులుగా పనిచేస్తూ వస్తున్నారు. వెంకటాపురం-వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి సుధాకర్‌ను కలిసి అతడు చెప్పిన పనులు చేస్తున్నారు. సానుభూతి పరులుగా పనిచేస్తూ మిలీషియా సభ్యులుగా పదోన్నతి పొందారన్నా రు. గత వారం రోజుల క్రితం సుధాకర్ ఆదేశాల మేరకు వారి ఆరుగురు కలిసి ఛ త్తీస్‌గఢ్ రాష్ట్రంలోని ఉట్లపల్లి అటవీ ప్రాంతానికి వెళ్లగా అక్కడ మావోయిస్టు అగ్ర నాయకులు, దళసభ్యులు, కొంతమంది మిలీషియా సభ్యులు ఉండగా అగ్రనాయ కుల ఆదేశాల మేరకు సుధాకర్ ఈ ఆరుగురికి డిసెంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు జరగబోయే పీఎల్జీఏ వారోత్సవాలకు సంబంధించిన కరపత్రాలను అంద జేసి మండలాల్లో పంచాలని వీరికి పనులు అప్పగించారు. ఈ కరపత్రాలతో సో మవారం పోలీసులకు చిక్కారని తెలిపారు. అంతేకాకుండా గతంలో వీరిపై నేరచరిత్ర ఉందని కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరచామన్నారు.
ఎవరు సహాయం చేయవద్దు
మావోయిస్టు పార్టీ నక్సల్స్‌కు ఎవరు కూడా ఎలాంటి సాయం చేయరాదని ఏఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. వారోత్సవాలు, ఇతర కార్యక్రమాలు అంటూ ప్రజలను, అమాయ గిరిజనులను నమ్మించి వారి స్వార్థం కోసం పనులు చేయించుకుంటున్నారు. ఆ తర్వాత మొఖం చాటేసి అమాయకమైన ఆదివాసీల జీవితాలతో మావోఇస్టులు చెలగాటం ఆడుతున్నారు. ఏజెన్సీలోని ప్రజలు అనుమానిత వ్యక్తులు వస్తే వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. వారి నుంచి కరపత్రాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. మిలీషియా సభ్యులను అరెస్టు చేసినందుకు వెంకటాపురం సీఐ శివప్రసాద్, ఎస్స్కె తిరుపతిని, సీఆర్పీఎఫ్ 58 బెటాలియన్ సీఐ ఓబయ్యలను ఏఎస్పీ అభినందించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసు పార్టీలో తనిఖీలు చేస్తున్నాయని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఏఎస్పీ తెలిపారు.