Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్ధన్నపేట సీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే రమేష్
నవతెలంగాణ-వర్ధన్నపేట
ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షు లు వర్ధన్నపేటఎమ్మెల్యే ఆ రూరి రమేష్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్సెంటర్ను ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశా రు. ఈ సందర్బంగా ఆస్ప త్రిలో అందుతున్న సేవల ను రోగులను అడిగి తెలు సుకున్నారు. ఆస్పత్రిలో మౌళిక వసతులపై డాక్టర్లతో చర్చించారు. అస్పత్రిలో నిర్వహిస్తున్న సదరం క్యాంప్ ను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడు తూ ఆస్పత్రికి వచ్చేరోగులకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని సూచించారు. అస్పత్రిలో ఏ సమస్య ఉన్నా నేరుగా తనదృష్టికి తీసుకురావాలని తెలిపారు. శిథిలావస్థలో ఉన్న మార్చురీ భవనాన్ని వీలైనంత తొందరగా కొత్తగా నిర్మించిన భవనానికి మార్చాలని అధికారులకు సూచించారు. ఆహ్లాదకర వాతావరణం ఏర్పాటు చేయాలనీ ఆదేశించారు. 30 పడకలు ఉన్న అస్పత్రిని త్వరలోనే 100పడకల ఆసుపత్రిగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గొడిశాల రవీందర్, వార్డు కౌన్సిలర్లు, అస్పత్రి వైద్యులు, తెరాస నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.