Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ములుగు అడిషనల్ కలెక్టర్ నాగపద్మజ
నవతెలంగాణ-గోవిందరావుపేట
ప్రతి మహిళ ఆర్థికాభివృద్ధి సాధించి ఇతరులకు మార్గ దర్శకం కావాలని ములుగు జిల్లా అడ ిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ ఇన్చార్జ్, డిఆర్డిఓ మండల స్పెషల్ ఆ ఫీసర్ నాగపద్మజ అన్నారు. మంగళవారం మండ లంలోని పసరలో పీఎస్ఆర్ గార్డెన్స్‌లో మహిళా సం ఘాల సభ్యులకు అవగాహన కార్యక్రమాన్ని కెనరా బ్యాంక్ పసర బ్రాంచ్ మేనేజర్ పూర్ణచందర్రావు అధ్య క్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నాగపద్మజ హాజరై మాట్లాడారు. ఒకప్పుడు ప్రతి కు టుంబం కుటుంబ పెద్ద సంపాదన పై ఆధారపడి జీవించేవారని ఇప్పుడు ఆ కుటుంబంలోని మహిళ ఆర్థిక అభివద్ధితో ఆ కుటుంబం అభివద్ధి పథంలో ప యనిస్తుందన్నారు. ప్రతి కుటుంబంకూడా ఆర్థిక అభి వృద్ధిలో గృహిణి పాత్ర కీలకమనే విషయాన్ని ఇప్ప టికే సమాజం గుర్తించిందన్నారు. మహిళా సంఘా లు ఏర్పడ్డనాటి నుండి నే టి వరకు పొదుపును ప్రతి మహిళ నేర్చుకోవడం జరి గిందన్నారు. ప్రధానంగా కెనరాబ్యాంక్ వంటి బ్యాం కుల ద్వారా రుణము పొం ది సద్వినియోగం చేసుకొ ని సకాలంలో కిస్తీలు చె ల్లించి మరింత ఆర్థిక అభి వృద్ధిని సాధించేందుకు అవసరమైన పలు విధానాలను వివరించారు. కెనరా బ్యాంకు మీబ్యాంక్ అని మీ ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించేందుకు మేము మా సిబ్బంది సహకారం ఎ ప్పుడూ ఉంటుందని బ్యాంకు సేవలను సద్వినియో గం చేసుకోవాలన్నారు.
ఒక్కోగ్రూపుకు రూ.20 లక్షల రుణం అందిస్తాం : కెఎస్.మాధవి, కెనరా బ్యాంకు వరంగల్ రీజినల్
ఒక్కొక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూపుకు ఆ గ్రూపు ఆర్దిక లావా దేవీలను పరిశీలించి 20 లక్షల వరకు అతి తక్కువ వడ్డీతో ఎలాంటి ప్రాసెసింగ్ చార్జెస్లేకుండా రుణ సౌకర్యం అందించేందుకు కెనరా బ్యాంకు ఎల్లవేళలా సిద్ధంగా ఉందన్నారు. ఇలాంటి అవకాశాలను సద్విని యోగం చేసుకొని మహిళలు ఆర్థిక స్వయం సమద్ధిని సాధించాలని సూచించారు. కెనరా బ్యాంకు ములుగు ఎల్డీఎం రాజకుమార్, మేనేజర్ పూర్ణచందర్‌లు బ్యాం కు నుండి కొనసాగుతున్న పలు పథకాలను సంక్షేమ కార్యక్రమాలను సామాజిక కార్యక్రమాలను స్కీముల ను మహిళలకు వివరించారు.