Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాశిబుగ్గ
సేల్స్ పైన జిఎస్టి కట్టిన తర్వాత ఆర్సీఎం (రివ ర్స్ చార్జి మెకానిజం )18శాతం కట్టాలని పాస్ చేసిన ఆర్డర్స్‌ను వెంటనే ఉపసంహ రించుకోవాలని వరం గల్ జిల్లా కాటన్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు చింతలపల్లి వీరారావు, కట్కూరి నాగభూషణం లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముడి పత్తి పైన ఆర్సీ ఎం విధించడాన్ని వ్యతిరేకి స్తూ మంగళవారం వరంగ ల్ వ్యవసాయమార్కెట్‌లో కాటన్ వ్యాపారులు నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీ తీ శారు. ఈ సందర్భంగా జి ల్లా అధ్యక్ష, కార్యదర్శులు వీరారావు, నాగ భూషణం లు మాట్లాడుతూ జీఎస్టీ (2017)చట్టంవచ్చిన త రువాత ఆగ్రోబేస్డ్ ఇండిస్టీ అన్నింటి పైన ఆర్ సి ఎం తీసివేసారని, కానీ తర్వాత మరోనోటిఫికేషన్ విడుద లచేసి కేవలం పత్తిపైనే ఆర్సిఎం పెట్టడం జరిగింద న్నారు. దీనివలన రైతుల వద్ద పత్తి కొన్నప్పు డు ముం దుగా 5 శాతం టాక్స్ కట్టవలసి వస్తుం దని, అమ్మకా లు జరగనిపక్షంలో మూలధనం భారం అవుతున్న ట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
పత్తిపై ఆర్సీఎం ను తీసివేయాలని గతంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అనేకసార్లు విన్నవించిన ట్లు తెలిపారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆర్థిక మంత్రి హరీష్ రావు జీఎస్టీ కౌన్సిల్ కు ఆర్ సి ఎం తీసివేయమని కోరడం జరిగిందన్నారు. జీఎస్టీ అధికారులు ఆర్సీఎం విషయంపై ఖమ్మం జిల్లా లో ని కాటన్ వ్యాపారులకు ఆర్డర్స్ పాస్ చేసి ఇబ్బం దు లకు గురి చేయడం సరికాదన్నారు. ఇప్పటికైనా త మ సమస్యను పరిష్కరించకపోతే పత్తి కొనుగోలను నిరావధికంగా నిలిపివేస్తామని హెచ్చరించారు.
ఈ నిరసన ర్యాలీ కార్యక్రమంలో కాటన్ అసోసి యేషన్ కోశాధికారి గోపిశెట్టి వేణుగోపాల్ వరంగల్ ఛాంబర్ ఆఫ్‌కామర్స్ అధ్యక్ష కార్యదర్శులు బొమ్మినేని రవీందర్‌రెడ్డి, మాడూరి వేద ప్రకాష్ ప్రతినిధులు చంద్రమౌళి, సంపత్, ఓంకారేశ్వర్, మల్లారెడ్డి, బిక్షపతి, శ్రీమన్నారాయణ, ప్రేమ్‌సాగర్, వ్యాపారులు తది తరులు పాల్గొన్నారు.