Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధర్మసాగర్
వద్ధుల సంరక్షణయే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందు కు సాగుతుందని ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. మండలంలోనీ సాయిపేట గ్రామంలోని గ్రామపంచాయతీ వద్ద మంగళవారం ధర్మసాగర్ మండ ల రైతుబంధు సమితి కన్వీనర్ సోంపల్లి కరుణాకర్ తాత-నాన్నమ్మ సోంపేల్లి రా మక్క, మల్లయ్యల జ్ఞాపకార్థం గ్రామంలోని వృద్ధులకు ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య చేతుల మీద వృద్ధులకు దుప్పట్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేయడానికి కరుణా కర్ ముందుకు రావడం అభినందనీయమన్నారు. అనంతరం గ్రామంలో ఇటీవల మరణించిన మేకల రోశయ్యకుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు రూ.5వేలు సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నిమ్మ కవితా రెడ్డి,పిఎసిఎస్ చైర్మన్ గుండ్రెడ్డి రాజేశ్వర్రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు స ర్పంచ్ మునిగేల రాజు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు కర్ర సోమిరెడ్డి,సర్పంచ్ మా మిడి రవీందర్యాదవ్, నాయకులు మారగోని బిక్షపతి,మామిడి కుమార్, మాచర్ల సుదర్శన్, గాజుల సదానందం,అందుబాటులో ఉన్న ప్రజాప్రతినిధులు,ముఖ్య నాయకులు,గ్రామస్తులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.