Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హసన్పర్తి
ఎనిమిదేళ్లుగా దేశాన్ని పరిపాలిస్తూ మాదిగలకు ఇచ్చిన మాటను నెరవేర్చకుండా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీ కరణపై నిర్లక్ష్యం వహిస్తున్న బీజేపీ ప్రభుత్వం మీద ప్రత్యక్ష యుద్ధానికి మాదిగ సమాజం సిద్ధం కావాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జన్ను దినేష్ మాది గ పిలుపునిచ్చారు. మండలకేంద్రంలో రాజారపు బిక్ష పతిమాదిగ అధ్యక్షతన నిర్వహించిన ముఖ్య కార్యకర్త ల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మా ట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధన కోసం 28 ఏండ్లుగా మాదిగ జాతి అలుపెరుగని పోరాటం చేస్తుందన్నారు. పాలకులకు చిత్తశుద్ధి, నైతిక నిబద్ధత లేని కారణంగా వర్గీకరణ జరగడం లేదన్నారు. ఎస్సీ వర్గీకరణను మేనిఫెస్టోలో చేర్చుకొని అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే పరిష్కారం చేస్తామన్న బీజేపీ నమ్మించి మోసంచేసిందన్నారు. నమ్మిన వాళ్లను మో సం చేయడం బీజేపీ సహజ నైజమన్నారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశారు. బీజేపీ నిర్లక్ష్యం మాదిగ జాతికి శాపంగా మా రిందని, బీజేపీ మెడలు వంచేందుకు మరో పోరాటా నికి సిద్ధంకావాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశం లో ఎమ్మెస్పీ జిల్లానాయకులు మేకలరమేష్, రేణు కుంట్ల దుర్గప్రసాద్, నమిండ్ల సూర్యంమాదిగ, రేణు కుంట్ల అశోక్ మాదిగ, బోడ బాబు మాదిగ, నమిండ్ల ప్రసాద్మాదిగ, వస్కుల వినరు మాదిగ, ఎమ్మార్పీ ఎస్మునిపల్లె గ్రామఅధ్యక్షులు బరిగెల రంజిత్ మాది గ, రామంచ యాకుబ్ తదితరులు పాల్గొన్నారు.