Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్
నవతెలంగాణ-హన్మకొండ
కేసీఆర్ సారధ్యంలో అభివృద్ధి చెందుతున్న తెలంగాణను విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు పన్నుతున్న శక్తుల పట్ల తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలని కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఆమరణ నిరా హారదీక్ష చేపట్టి నేటితో 13 ఏండ్లు అయిన సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విఫ్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్ ఆధ్వ ర్యంలో కాళోజి సెంటర్ వద్ద మంగళవారం దీక్ష దివాస్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వ హించారు. ముఖ్య అతిథిగా దేశపతి శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ ఇప్పుడిప్పుడే ప్రగతిపథంలో పయ నిస్తుంటే గిట్టని కేంద్రం అడుగడుగునా అడ్డంకులు సష్టిస్తూ అణచివేతకు పాల్పడుతోం దన్నారు. చైతన్యానికి నెలవైన తెలంగాణలో మతోన్మాదుల ఆటలు సాగవని హెచ్చరిం చారు. కేసీఆర్ ఆమరణ దీక్ష సబ్బండ వర్గాలను ఏకం చేసి ఉద్యమానికి ఊతమిచ్చిందన్నారు. తెలంగాణ పోరాటంలోనే కేసీఆర్ దీక్ష ఒక మైలురాయిగా నిలిచిపోయిందన్నారు. ఓరుగ ల్లు కేంద్రంగా సీమాంధ్రుల కుట్రలకు వ్యతిరే కంగా శాసన సభ్యుడిగా పోరాడిన చరిత్ర దాస్యం వినరు భాస్కర్ కే దక్కుతుందన్నారు. ఉద్యమకాలంలో ఆంధ్రప్రదేశ్ అవతరణ, కాకతీయ ఉత్సవాల సందర్భంగా నిరసనల రూపంలో ఆయన ప్రదర్శించిన ధైర్య, సాహసాలు వెలకట్టలేనివని కొనియాడారు. ఉద్యమంలో ఓరుగల్లు ప్రజలు కేసీఆర్ వెన్నంటి నడవడమే కాక ఎన్నో ఉద్యమ రూపాలకు ఆయువు పోసారన్నారు. ప్రజాకవి కాళోజీ, తెలంగాణ స్వాప్నికుడు జయశంకర్, దాశరథి మరియు బమ్మెర పోతనలు జన్మించిన నేల ఓరుగల్లు అని కొనియాడారు.కాకతీయుల సౌర్యం, సమ్మక్కసారలమ్మల ధైర్యం ఓరుగల్లు సొంతం అన్నారు. అట్లాంటి ఓరుగల్లు గడ్డ మీద మళ్ళీ ఉద్యమ జ్ఞాపకాలను గుర్తు చేసుకో వడం అభినందనీయమన్నారు. చరిత్రను వర్త మానంలో నెమరువేసుకోకపోతే చరిత్రకు గమ్యం ఉండదన్నారు. తెలంగాణ ఎక్కడిది అన్న కాడి నుండి శాసించి గాంధీయిజ పం థాలో నేడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని అనేక సమస్యలను అతి కొద్ది కాలంలోనే పరిష్క రించుకున్నట్టు తెలిపారు. అమరవీరుల రక్తం తో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో విచ్ఛి న్న మతతత్వ శక్తులు మళ్ళీ రక్తం పారించాలని కుట్రలు చేస్తున్నాయన్నారు. అట్లాంటి శక్తులు ఆ ప్రయత్నాలు మానుకోవాలని విజ్ఞప్తి చేశా రు. అనంతరం ప్రభుత్వ చీఫ్ విఫ్ దాస్యం విన య భాస్కర్ మాట్లాడుతూ కేసీఆర్ స్పూర్తితోనే తెలంగాణ ఉద్యమంలో తాను తెగించి పోరా డానని తెలిపారు. ఉద్యమ జ్ఞాపకాలను నెమరు వేసుకున్న ఆయన తన వెంట ఉన్న కార్య కర్తలకు కతజ్ఞతలు తెలిపారు. అనంతరం ప్రముఖ ఆర్థిక నిపుణుడు, ప్రొఫెసర్ పాపా రావు మాట్లాడుతూ తాను ఆంధ్రా ప్రాంతం వాడినైనా తెలంగాణ ఉద్యమానికి నైతిక మద్దతు తెలపానని నేడు తెలంగాణ అన్ని రంగాల్లో అభివద్ధి సాధించడం గొప్ప విషయ మన్నారు. కానీ, కేంద్ర ప్రభుత్వం పలు కేంద్ర రంగ సంస్థలను అమ్మేస్తూ ప్రయివేటు రంగానికి కొమ్ము కాయడం సిగ్గుచేటన్నారు. అహింస సిద్ధాంతంతో గాంధేయ మార్గంలో నడిచిన తెలంగాణ ఉద్యమం దేశానికి స్ఫూర్తిగా నిలిచిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి,కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్,గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజిజ్ ఖాన్,మాజీ కూడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి,పలు డివిజన్ల కార్పొరేటర్లు, అధ్యక్షులు,మాజీ కార్పొరేటర్లు,కార్యవర్గ సభ్యులు, ముఖ్య కార్యకర్తలు, టిఆర్ఎస్వి విద్యార్థి నాయకులు తదితరులు పాల్గొన్నారు.