Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్యాక్రాంత, భూదాన యజ్ఞ, ప్రభుత్వ భూములపౖెె
నవతెలంగాణ- స్టేషన్ఘనపూర్
అన్యాక్రాంతమవుతున్న, భూదాన యజ్ఞ, ప్రభుత్వ భూములే గాక, పేదల ఇండ్ల స్థలాల కోసం రాబోయే రోజుల్లో పోరాటాలు ఉదతం చేస్తామని వ్యవసాయ కార్మిక సంఘం(వ్యకాస) జాతీయ కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్ హెచ్చరించారు. డివిజన్ కేంద్రంలో అమరుడు అంబటి సత్యనారాయణ సభా వేదికగా జిల్లా కార్యదర్శి సింగారపు రమేష్, సహయ కార్యదర్శి ఎన్నకూస కుమార్ అధ్యక్షతన జరుగు తున్న 2వ జిల్లా మహాసభలు మంగళవారంతో ముగిశాయి. ముఖ్య అతిథిగా ప్రసాద్ హాజరై మాట్లా డుతూ... జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకులు ఆక్రమించుకున్న భూధాన యజ్ఞ, అసైన్డ్, ప్రభుత్వ భూములన్నింటిపై పోరాటా లకు సంఘటితంగా ఉద్యమించేందుకు ఈ మహా సభల్లో తీర్మానించినట్లు తెలిపారు. జిల్లాలో సుమారు 9634 ఎస్సీ కుటుంబాలకు, 1976 గిరిజన కుటుం బాలకు, 16వేల 367 బీసీ కుటుంబాలకు సాగు భూ ములు లేవని, ఈ పరిస్థితుల్లో వారి జీవితాల మార్పు కోసం రాష్ట్ర ప్రభుత్వం కానీ, జిల్లాలో ప్రజా ప్రతి నిధులు, అధికార యంత్రాంగం గానీ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన దళితుల మూడెకరాల సాగుభూమి పథకం ఎన్నడో అటకెక్కిం దని అన్నారు. అసలైన మౌలిక సమస్యను పరిష్క రించకుండా, సంక్షేమ పథకాల పేరుతో ఎన్ని అమలుపర్చినా నిరుపయోగమవుతాయని అన్నారు. పేద జీవితాలను మార్చడమంటే, సాగు భూమి చేతికిచ్చి, ఇంటి వసతి కల్పించి, ఉచిత నాణ్యమైన విద్య, వైద్యం అందుబాటులోకి తెచ్చినప్పుడే సమస్య పరిష్కారవుతుందన్నారు.
ప్రస్తుత పాలకవర్గాలు సామాన్య ప్రజానీకాన్ని మభ్యపెడుతూ మరిన్నీ పథకాలు తేస్తారేకానీ, శాశ్వత పరిష్కారం చేయ కుండా, ప్రజల్ని అణిచిపెట్టే ధోరణిని అవలంభిస్తు ్తన్నారని విమర్శించారు. గ్రామీణ, పట్టణ ప్రాంత పేదల్ని చైతన్యవంతం చేసేందుకు కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఏదునూరి వెంకట్రాజం మాట్లాడుతూ... జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని, పోరాడి సాధిం చుకున్న చట్టాన్ని నిలబెట్టుకునేందుకు పేదలంతా ఐక్యమై, కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఉపాధి హామీకి కేంద్ర బడ్జెట్లో రూ.2లక్షల40వేల కోట్లు కేటాయించి, 200 పని దినాలు ప్రతి కూలీకి కల్పిస్తూ రూ.600 దినసరి వేతనాన్ని ఇవ్వాలని, పనిప్రదేశాల్లో సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ మహాసభల్లో సంఘం జిల్లా నాయకులు సోమసత్యం, గంగాపురం మహేందర్, పుత్కనూరి ఉపేందర్, వడ్లకొండ సుధాకర్, పొలాస కిష్టయ్య, దుర్గ ప్రసాద్, మబ్బు వెంకటేష్, యాకయ్య, కాకర్ల లక్ష్మి ,బాబు ఆనందం, తదితరులు పాల్గొన్నారు.