Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సఖి సెంటర్ అడ్మిన్ గాయత్రి
నవతెలంగాణ-భూపాలపల్లి
మహిళలను హింసించకుండా, సమాజంలో స్వేచ్ఛనిస్తూ వారి హక్కులకు భంగం కలగకుండా ఆనందంగా కుటుంబంతో జీవనం కొనసాగించాలని భూపాలపల్లి సఖి సెంటర్ అడ్మినిస్ట్రేటర్ గాయత్రి అన్నారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా , డిస్ట్రిక్ వెల్ఫేర్ ఆఫీసర్ సామ్యూల్ ఆదేశాల మేరకు సఖి కేంద్రం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ స్త్రీ హింస వ్యతిరేక పక్షోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అంతర్జాతీయ స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవం.. నవంబర్ 25 నుండి ప్రారంభమై మానవ హక్కుల దినోత్సవం డిసెంబర్ 10 వరకు పక్షోత్సవాలు కొనసాగుతాయని తెలిపారు. జిల్లా లోని చైల్డ్ లైన్, బిఆర్బి, మహిళా శక్తి కేంద్రం, ఐసిడిఎస్ డిపార్టుమెంట్లను కలుపుకొని జిల్లా వ్యా ప్తంగా రోజుకో కార్యక్రమం చేపట్టి స్త్రీ హింసకు వ్యతి రేకంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్టు చెప్పారు. డిసెంబర్ 25న ప్రగతి భవనంలో కలెక్టర్ బవేష్ మిశ్రా, బీడబ్ల్యుఓ శామ్యూల్ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని శాఖల అధికారులకు, ఉద్యోగులకు అవగాహన కార్యక్రమం, 26న కలెక్టర్ కార్యాల యంలో సంతకాల సేకరణ, 27న మల్హాల్రావు, పలిమెల, టేకుమట్ల, మోగుల్లపల్లి మండలాల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు 28న మల్హర్రావు, పలిమెల ,మహా ముత్తారం, కాటారం, టేకుమట్ల గ్రామాల్లో పెద్ద ఎత్తున స్త్రీలపై జరిగే హింసకు వ్యతిరేకంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. మంగళవారం గణపురం మండల కేంద్రంలోని కస్తూర్బా కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించి మండల కేంద్రంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించి అవగాహన కార్యక్రమం నిర్వహిం చామన్నారు. స్త్రీలపై హింస జరిగినప్పుడు ప్రతి ఒక్కరు స్పందించి, బాధిత మహిళలకు చేయూతని వ్వాలని కోరారు. ఎక్కడైనా స్త్రీ హింసకు గురైతే వెంటనే 181 టోల్ ఫ్రీ నెంబర్కు గానీ, డయల్ 100కు గాని సమాచారం ఇవ్వాలన్నారు. విద్యార్థి నులు అయితే 1098కు సమాచారం ఇవ్వాలన్నారు బాధిత మహిళలకు సఖి కేంద్రం ఎల్లవేళలా అందుబాటులో ఉంటు హక్కున చేర్చుకుని ఐదు రకాల సేవలు కౌన్సిలింగ్, న్యాయ సహాయం, వైద్య సహాయం, పోలీస్ సహాయం, తాత్కాలిక వసతితో పాటు బాధిత మహిళకు సఖి కిట్టుని ఉచితంగా అందిస్తుందని అన్నారు. ఆపదలో ఉన్న మహిళలు సఖి టోల్ ఫ్రీ నెంబర్ 8500 009433కు సమాచా రమిస్తే తమ సిబ్బంది స్పందించి సమస్యను పరిష్క రించేందుకు కృషి చేస్తారన్నారు. సఖి సెంటర్కు రాలేని పరిస్థితిలో ఉంటే తమ టీం ఘటనాస్థలికి వెళ్లి బాధిత మహిళను రక్షించి సఖి సెంటర్ కు తీసుకొస్తుందని తెలిపారు.