Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కానుగంటి రంజిత్‌కుమార్
నవతెలంగాణ-జఫర్గడ్
ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలను వెంటనే చేపట్టాలని టీఎస్ యూటిఎఫ్ జనగామ జిల్లా అధ్యక్షులు కానుగంటి రంజిత్‌కుమార్ డిమాండ్ చేశారు. మండలంలోని మంగళవారం కోరుకొప్పుల రాజు అధ్యక్షతన జరిగిన యూటీఎఫ్ మండల మహా సభకు ముఖ్య అతిథిగా రంజిత్‌కుమార్ హాజరై మాట్లాడారు. ఏడు సంవత్స రాలుగా పదోన్నతులు లేక ఉపాధ్యాయులే కాకుండా విద్యా వ్యవస్థ నష్ట పోతుందన్నారు. 317 జీవో వల్ల నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని, పెండింగ్‌లో డీఏలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం మహాసభలో మండల నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. మండల అధ్యక్షులుగా కోరుకొప్పుల రాజు, ప్రధాన కార్యదర్శిగా పి. భాను ప్రకాష్, ఉపాధ్య క్షులుగా వి. శ్రీనివాస్, మహిళా ఉపాధ్యక్షురాలుగా సిహెచ్. ఉమారాణి, కోశాధికారిగా ఏ. కష్ణమోహన్, కార్యదర్శులుగా ఎస్. పావని, జి.యశ్వంత్ కుమార్, కె.రజిత, ఆడిటర్ గా తాడూరి సుధాకర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి మంగు జయప్రకాష్ ప్రకటించారు. అనంతరం నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ... తమ ఎన్నికకు సహక రించిన సంఘ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో ముందుంటామని తెలిపారు.
యూటిఎఫ్ మండల కమిటీ ఎన్నిక
రఘునాథపల్లి : మండల కేంద్రంలో టీఎస్ యూటిఎఫ్ సర్వసభ్య సమావేశం మంగళ వారం జరిగింది. 2022-23కు గాను రఘునాథపల్లి మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడుగా చిదురాల నాగరాజం, ప్రధాన కార్యదర్శిగా టేకులపల్లి జంపయ్య ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా జ్యోతి శ్రీహరి వ్యవహరించారు. ఉపాధ్యక్షులుగా ఏ. శ్రీనివాసులు,ఎం కౌన్సలాతీనా, కోశాధికారిగా బి.పవన్ కుమార్ కార్యదర్శిలుగా పి.భాస్కరాచారి,ఎస్. నరసింహులు,వై.విజయ, బి.వినోద, వి.వెంకటేశ్వర్లు జిల్లా డెలిగేట్స్ గా జె. శ్రీహరి,పి.ఇన్నారెడ్డి, ఎం.వి చక్రధర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. యూటిఎఫ్ జిల్లా ప్రధానకార్యదర్శి శ్రీనివాసరావు హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రమోషన్లు, బదిలీల షెడ్యూల్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.