Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
విద్వేశపూరితంగా రెచ్చగొడితే వైఎస్.షర్మిల పా దయాత్రకు అడ్డంకులు తప్పవని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. బుధవారం క్యాంప్ కా ర్యా లయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పెద్ది మాట్లాడుతూ నమ్మించి గొంతులు కోసిన చరిత్ర నీ కుటుంబానిదని, నాడు తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసేందుకు ఆరుగురు ఎమ్మెల్యేలకు ఆశజూపి గొంతు నలిపింది నీ నాయన వైఎస్ కాదని గుర్తు చే శారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో అంతర్గత విధ్వేశాలను రేకిత్తించి పల్లెల్లో ప్రశాంతత లేకుండా చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విసిరిన బాణమే షర్మిలని రుజువైందన్నారు. స్వయం పాలనకై నాడు కేసీఆర్ నేతృత్వంలో సాగిన ఉద్యమ ఫలితంగా తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయ డానికి కుట్రలు పన్నారని వి మర్శించారు. అందులో భాగ మే షర్మిల పాదయాత్ర అని అ న్నారు. తెలంగాణలో తిరిగే హక్కు షర్మిలకు ఎక్కడిదని ప్ర శ్నించారు. ఆంధ్రప్రజల సమ స్యలను గాలికొదేలేసి ఇక్కడి ప్రజలపై మొసలి కన్నీరు పె ట్టుకోవడం విడ్డూరంగా ఉంద న్నారు. పాదయాత్ర పేరిట తె లంగాణ ఉద్యమకారులను, సీ ఎం కేసీఆర్‌ను అవమానపర్చుతూ షర్మిల మాటలు అభ్యంతకరంగా ఉన్నాయన్నారు. షర్మిల తీరుపై మ హిళలు అసహ్యిం చుకుం టున్నారని తెలిపారు. తె లంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని భావిస్తే అ డుగడుగునా అడ్డంకులు ఎదుర్కొక తప్పదని స్పష్టం చేశారు. షర్మిల చిల్లర మాటల వల్ల రాజకీయ వ్యవస్థ భ్ర ష్టుపడు తుందన్నారు. ఇక తాను ఆస్తులను సం పాదించానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ని రూపిస్తే వాటిని ప్రజలకు పంచడానికి సిద్దమని, అదే నీకుటుంబం కూడగట్టిన ఆక్రమ ఆస్తులను చెబితే సంతకం పెట్టడానికి సిద్ధమేనాని సవాల్ విసిరారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో నీ కుటుంబం తెలంగాణలోని ప్రతి జిల్లాలో వందలాది ఎకరాల భూములను కూడగట్టిందిని నిరూపించడానికి తాము సిద్దంగా ఉన్నామని తెలిపారు. భూపాలపెల్లి జిల్లా చిట్యాల మండలం నవాబుపేట భూముల వె నుక బినామీలు ఎవరో చెప్పాలన్నారు. సంగారెడ్డి జి ల్లా పూడూరులోని వందలాది ఎకరాలు ఎక్కడి నుం చి వచ్చాయో చెప్పాలన్నారు. భూమి లేని నిరుపేదల చే అట్టి భూముల్లో జెండాలు పాతిస్తామని అన్నారు. బయ్యారం గనులపై మీ కన్నుపడితే కదా నాడు పో రాడి అడ్డుకొన్నామని మరిచిపోలేదన్నారు. వైఎస్ పాలనలో వందల కోట్ల అక్రమ ఆస్తులను పోగుచేసు కొని నేడుపాదయాత్ర పేరుతో తిరుగుతూ కేసీఆర్‌పై, మంత్రులు, ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేయ డం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నిజం గా తెలంగాణ ప్రాంతంపై నీకు చిత్తశుద్ది, దమ్ముంటే నీ అన్న, ఏపీ సీఎం జగన్ తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్రానికి ఇచ్చిన లేఖలను వెనక్కి తీసుకోవాలని కోరాలన్నారు. ఆ లేఖల వల్ల నర్సంపేట ప్రాంతానికి కూడా నష్టం వాటిల్లితుందన్నారు.జగన్ అభ్యంతరాల వల్ల ఇక్కడి పాకాల చెరువులోకి గోదావరి నీళ్లు రాకుండా ఆగిపోయిందని గుర్తు చేశారు.
ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్, ఖానాపురం ఎంపీపీ వేములపెల్ల ప్రకాష్‌రావు, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షులు నాగెల్లి వెంకటనారాయణ గౌడ్, బత్తిని శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు గుంటి కిషన్, నామాల సత్యనారాయణ, కోమండ్ల గోపాలరెడ్డి, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షులు గోనె యువరాజు, తదితరులు పాల్గొన్నారు.