Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధర్మసాగర్
మత్స్య కార్మికులు ఆర్థికంగా ఎదగడం కోసం ప్రభుత్వం వారి ఆర్థిక పరిపుష్టిని పెంపొందించుటకు ఉద్దేశించినదే ఉచిత చేపపిల్లల పంపిణీ పథకంమని ఎమ్మెల్యే డాక్టర్ తాడికొండ రాజయ్య అన్నారు. బుధ వారం మండల కేంద్రంలోని రిజర్వాయర్ నందు నాలుగు లక్షల ఉచిత చేప పిల్లలను రిజర్వాయర్ లో నికి విడుదల చేయడం చే శారు. అనంతరం మత్స్య కార్మికులు ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన పా ల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ మత్స్యశాఖ ఆధ్వ ర్యంలో మత్సకారుల అభి వృద్ధి సంక్షేమమే కోసం ధ ర్మసాగర్ రిజర్వాయర్లో 4 లక్షల ఉచిత చేప పిల్లలను రిజర్వాయర్ లోకి వదలడం జరిగిందని తెలిపారు. అంబేద్కర్ ఆశయసాధనలో భాగంగారాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని కులాల వారికి దామా షా జనాభా నిష్పత్తి ప్రకారం అభివద్ధి సంక్షేమ ఫలాలను అందిస్తున్నారు. అందులో భాగంగా ముది రాజులకు ఉచిత చేపపిల్లలతోపాటు ఉచిత రొయ్య పిల్లలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. కార్మి కులు ప్రమాదవశాత్తు చెరువులో మరణిస్తే రూ.5 లక్షల బీమాసౌకార్యం అందిస్తుందన్నారు.ఈ కార్యక్ర మం లో ఎంపీపీ నిమ్మ కవితరెడ్డి, జిల్లా కోప్టేట్ సభ్యు రా లు లాల్మొహమ్మద్, జిల్లామత్స్య శాఖ డైరెక్టర్ పిట్టల సత్యనారాయణ, వైసీపీబండారు రవీందర్, తహశీ ల్దార్ మర్కల రజిని, ఎంపీడీవో జోహార్ రెడ్డి, మండ ల పార్టీ అధ్యక్షులు సర్పంచి మునిగిల రాజు, సర్పం చులు ఎర్రబెల్లిశరత్, కర్రసోమిరెడ్డి, ఎంపీటీసీలు బొడ్డు శోభా సోమయ్య, రొండి రాజు యాదవ్, కళ్లెపు రమాదేవి, మాచర్ల సుదర్శన్, బొక్క దయాకర్, కురు సపల్లి బిక్షపతి,ముఖ్య నాయకులు సోంపల్లి కరుణా కర్, రావుల వెంకట్రెడ్డి, ప్రజాప్రతి నిధులు, పలు శా ఖల అధికారులు,మత్స్య సహకార సంఘాల నాయ కులు సభ్యులుమత్స్యకారులు పాల్గొన్నారు.