Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శాయంపేట
మండల పరిధిలోని గ్రామాల్లో 2017 నుండి 2020 వరకు గ్రామాల్లో జరి గిన ఉపాధి హామీ పథకం పనులను బుధవారం కేంద్ర బృందం సందర్శించి తనిఖీ చేశారు. ముందుగా ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్న కేంద్ర బందం 2017 నుండి 2020 వరకు జరిగిన పనులకు సంబంధించి రికార్డులను పరిశీలించారు. జరిగిన పనులు, డబ్బుల చెల్లింపుల రికార్డులను పరిశీలించారు. అనంతరం కొత్తగ ట్టు సింగారం, గోవిందాపూర్, పెద్దకోడపాక, పత్తిపాక గ్రామాలలో పర్యటించి అy ెన్యూ ప్లాంటేషన్ మొక్కలను, రోడ్డు లైన్ మొక్కలను, బ్లాక్ ప్లాంటేషన్, కందకాలు, పాఠశాల వంటగది( కిచెన్ గార్డెన్), ఎరువుల గుంతలను (కంపోస్ట్ బిక్స్) పరిశీలిం చారు. ఈ సందర్భంగా కేంద్ర బంద సభ్యురాలు మహబూబ్నగర్ అడిషనల్ డిఆరి ్డఏ జక్రియ సుల్తానా మాట్లాడుతూ మినిస్టర్ ఆఫ్ ఆర్ డి శిక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం స్పాన్సర్ చేసే అన్ని పథకాలను పరిశీలించి ఆడిట్ రిపోర్ట్ చేయడం జరుగుతుందని అన్నారు. దానిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకం లో మూడేళ్ల పాటు జరిగిన పనుల రికార్డులను, పేమెంట్స్ రికార్డులను పరిశీలించడం జరిగిందన్నారు. షెడ్యూల్డ్ ప్రకారం మండల పరిధిలోని ఐదు గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించి ఆడిట్ చేయడం జరిగింద న్నారు. ఆడిట్ నివేదికను మినిస్టర్ ఆఫ్ ఆర్ డి కి అందజేస్తామన్నారు. ఈ తనిఖీల లో కేంద్ర బంద సభ్యులు మెదక్ ఎంపీడీవో నవీన్ కుమార్, మేడ్చల్ డిప్యూటీ సీఈవో సరిత, డిఆర్డిఆర్ డిస్ట్రిక్ట్ మేనేజర్ సురేందర్ పాల్గొన్నారు. వీరి వెంట ఎంపీడీవో ఆమంచ కష్ణమూర్తి, ఏపీఓ కీర్తి అనిత, ఈజిఎస్ సిబ్బంది పాల్గొన్నారు.