Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
తిరస్కరించిన పోడు సాగు దారుల ధరఖాస్తులకు చెందిన భూములను తిరిగి సర్వే చేయా లని తెలంగాణ వ్యవసాయ కార్మి క సంఘం జిల్లా కార్యదర్శి భూక్య సమ్మయ్య అన్నారు. బుధవారం ఆర్డీవోకు వ్యకాస ఆధ్వర్యంలో వి నతిపత్రం అందజేశారు. ఈ సం దర్భంగా సమ్మయ్య మాట్లాడుతూ ఎఫ్ఆర్సీ కమిటీల పాత్ర లేకుండా అటవీ శాఖ అధికార యంత్రాంగం ధరఖాస్తులను తిరస్కరించి నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారాన్నారు. పోడు సాగు చేస్తున్న రైతులందరికి హక్కు పత్రాలు ఇస్తామని ఒక వైపు ప్రభుత్వం చెబుతుందని అందుకు భిన్నంగా అటవీ శాఖ అధికారులు వ్యవహరిస్తూ పోడుదారులను భయభ్రాంతులకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సూరిపెల్లి, లింగగిరి, నాగారం పరిధిలో అనేక యేండ్లగా సాగు చేసుకొంటున్న భూములను సర్వే చేయకుండా అటవీ శాఖ అధికారులు ఇబ్బందులకు గురిచేయాడం అభ్యంతరకమన్నారు. 2005కు ముందే ఇట్టి భూములపై పోడుదారులపై పారెస్టు అధికారులు కేసులు పెట్టిన ఆధారాలు ఉన్నా వాటిని పరిగణంలోకి తీసుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరించి అన్యాయం చేయడం సరైందికాదన్నారు. లేనిపక్షంలో పోడుదారులచే తిరుగుబా టు ఎదుర్కొకతప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సం ఘం జిల్లా అధ్యక్షులు నమిండ్ల స్వామి, సంఘ నాయకులు మైదం మాణిక్యం, కేశ వులు, జన్ను సోము, సుమిత్ర, జీ.రమాదేవి, ఎం ప్రభాకర్, చుంచు వీరమ్మ, జలుగూరి ముత్యం, తదితరులు పాల్గొన్నారు.