Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
జూనియర్ విద్యార్థులను రాగింగ్ పేరుతో హింసిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని వరంగల్ ఏసీపి గిరి కుమార్ కల్కోట వైద్య విద్యార్థులను హెచ్చరిం చారు. బుధవారం వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో సీనియర్ వైద్య వైద్యర్థులకు యాంటీ రాగింగ్ చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని మట్టేవాడ సిఐ సిహెచ్ రమేష్ తో కలసి నిర్వహించారు. 400 మంది విద్యార్థులకు ర్యాగింగ్ చేయడం వల్ల పడే శిక్షల గురించి తెలియజేశారు. అంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన జూనియర్ విద్యార్థుల పట్ల స్నేహపూర్వక భావంతో కలిసి మెలిసి నడుచుకోవాలే తప్ప వారిని భయభ్రాంతులకు గురిచేస్తూ ర్యాగింగ్ చేయకూడదని అన్నారు. యాంటీ ర్యాగింగ్ కొరకు కేఎంసి ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్ సహాయంతో యాంటీ ర్యాగింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని ,అలాగే యాంటీ ర్యాగింగ్ కు సంబంధించిన అవగాహన పోస్టర్లను కెఎంసి ఆవరణలో అంటించడం జరిగిందని, ఎవరు ర్యాగింగ్ కు పాల్పడిన చట్టపరమైన చర్యలు కఠినంగా ఉంటాయని సూచించారు ఈ కార్యక్రమంలో కాకతీయ మెడికల్ కళాశాల ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.