Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు
నవతెలంగాణ-వరంగల్ రీజినల్ ప్రతినిధి
రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీల అమలుకు పోరాటాలు నిర్వహించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస రావు అన్నారు. బుధవారం హనుమకొండ బాల సముద్రంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా సమితి సమావేశం కర్రె లక్ష్మణ్ అద్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తక్కళ్లపల్లి శ్రీనివాస రావు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో వచ్చిన బిజెపి ప్రభుత్వం గడిచిన ఎనిమిదేండ్లుగా విభజన హామీలను నెరవేర్చకుండా తెలంగాణకు తీరని ద్రోహం చేస్తున్నదని అన్నారు. ఉమ్మడి వరంగల్ కు రావాల్సిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ, ములుగులో గిరిజన యూనివర్సిటీ, వరంగల్ కు మెగా టెక్స్ టైల్ పార్క్ లాంటి హామీలను నెరవేర్చడం లేదని అన్నారు. అభివద్ధిలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఎంతో వెనుకబడి పోయిందని, ఉత్తర, దక్షిణ భారతావనికి రైల్వే కూడలిగా వున్న కాజీపేటలో రైల్వే పరిశ్రమలు నెలకొల్పాల్సిన అవసరం ఉన్నప్పటికీ నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. కాజీపేటను రైల్వే డివిజన్ కేంద్రంగా ప్రకటించాలన్న ప్రజల ఆందోళనను పట్టించుకోలేదని అన్నారు. కాజీపేటలో రైల్వే పరిశ్రమలతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వరంగల్ లో భారీ పరిశ్రమలు నెలకొల్పాల్సిన అవసరం ఉందన్నారు. భారీ పరిశ్రమల స్థాపనకు, విభజన హామీల అమలుకు పోరాటాలు నిర్వహించాలని అన్నారు. ఈ సమావేశంలో మాజీ శాసన సభ్యులు పోతరాజు సారయ్య, సిపిఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి కె. బిక్షపతి, జిల్లా సహాయ కార్యదర్శి తోట బిక్షపతి, నాయకులు ఆదరి శ్రీనివాస్, మద్దెల ఎల్లేష్, మండ సదాలక్ష్మి, ఉట్కూరి రాములు,దుప్పటి సాంబయ్య,ఏఐవైఎఫ్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్,పల్లేరు వీరస్వామి, జక్కు రాజు, మంచాల రమాదేవి,బట్టు మల్లయ్య,మునిగాల బిక్షపతి, బాషబోయిన సంతోష్, ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు.