Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నగర మేయర్ గుండు సుధారాణి
నవతెలంగాణ-వరంగల్
తెలంగాణ ప్రజలను రెచ్చకొట్టే విధంగా మాట్లాడిన షర్మిల అనుచిత వ్యా ఖ్యలను బేషరతుగా ఖండిస్తున్నామని మేయర్ గుండు సుధారాణి అన్నారు. వరంగల్ నగర పాలక సంస్థ మేయర్ చాంబర్లో బుధవారం విలేకరుల సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంలో అడ్డుకున్న షర్మిల తెలంగాణ ఉద్యమకారులను విమర్శించడం సరై నదికాదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను దోచుకోవడమే వైఎస్ఆర్ కుటుంబం లక్ష్యం అని అన్నారు. చీకటి ఒప్పందాలతో తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తూ ఎమ్మెల్యే, ముఖ్యమంత్రిని అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. తెలంగాణ రాష్ట్రం మహిళలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉద్యమంలో బతుకమ్మల తో ఆహ్వానం పలికారన్నారు. కానీ ఒక మహిళగా షర్మిల కేసీఆర్ ను తాళిబన్ల తో పోల్చడం సరైనది కాదన్నారు. కెసిఆర్ గాంధీయవాదని అన్నారు. షర్మిల చేసేది పాదయాత్ర కాదు దండయాత్ర లాగా ఉందన్నారు.