Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 10 కోట్లతో ఆయుష్ కళాశాల భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన - ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
నవతెలంగాణ-గణపురం
రాష్ట్రంలో ప్రజలందరికీ నాణ్యమైన విద్యా, వైద్యం అందించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది నిధు లు కేటాయిస్తూ పెద్దపీట వేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. బుధవారం మండలం లోని చెల్పూర్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని 1000 క్వార్టర్ల సమీపంలో రూ10కోట్ల రూపాయలతో నిర్మించతల పెట్టిన 50 పడకల ఆయుష్ వైద్య కళాశాల భవన నిర్మాణ సముదాయానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం మూడు ఆయు ష్ వైద్య కళాశాలలు ఏర్పాటు చేసేందుకు అనుమతులు మంజూరు చేయగా అందులో ఒకటి జయశంకర్ భూపాల పల్లి జిల్లాకు కేటాయించడం అందులో మండలంలో ఏర్పా టు చేయడం సంతోషదాయకమన్నారు. వైద్యశాలలు కేటా యించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావులకు కతజ్ఞతలు తెలిపారు. నిర్మాణ పనులను త్వరితగతిన చేపట్టి వచ్చే విద్యా సంవత్సరంలో తరగతులు ప్రారంభించే విధంగా కాంట్రాక్టర్ ప్రత్యేక భవన నిర్మాణా లను పూర్తిచేయాలని అధికారులను కాంట్రాక్టర్ను ఆదేశిం చారు. రానున్న కొద్ది రోజుల్లో మెడికల్ కళాశాల ఆయుష్ కళాశాలలు ప్రారంభమైతే వైద్యరంగంలో ప్రజలకు మెరుగైన వైద్య సహాయం అందుతుందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ విద్య వైద్యం వ్యవసాయం ఉపాధి తదితర రంగాలపై ప్రత్యే క శ్రద్ధ చూపుతుందని ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేయడం తగదని వారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నడిపెల్లి మధుసూదన్ రావు, ఎంపీపీ కావటి రజిత రవీందర్, భూపాలపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ వెంకటరాణి సిద్దు ఎంపీటీసీలు చెన్నూరి రమాదేవి మధుకర్ పోనగంటి సుధర్మ మలహల్ రావు, ఉప సర్పంచ్ రజియా,టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పోలుసాని లక్ష్మీ నరసింహారావు, నాయకులు కొత్త వెంకన్న,పిన్నింటి శ్రీనివాసరావు, ఐతు రమేష్, పిన్నింటి మాధవరావు, తోట శ్రీనివాస్,పేరాల దేవేందర్ రావు తదితరులు పాల్గొన్నారు.