Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూ సమస్యలను పరిష్కరించాలి - గండ్ర సత్యనారాయణ రావు
నవతెలంగాణ-భూపాలపల్లి
రాష్ట్రంలో వెంటనే ధరణీ వ్యవస్థను రద్దు చేసి, నిషేధిత జాబితాలో తప్పుగా నమోదైన భూముల సమస్యను పరిష్క రించాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ గండ్ర సత్య నారాయణరావు అన్నారు. బుధవారం టీపిసిసి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్త ఒక్క రోజు నిరసన దీక్షలో భాగంగా జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వ ర్యంలో ఉదయం నుండి సాయంత్రం వరకు నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ నిరసన దీక్ష కార్యక్రమంలో కాం గ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అయిత ప్రకాశ్ రెడ్డితో కలిసి టీపీసీసీ సభ్యులు, భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. అనంతరం నిరసన దీక్షనుద్దేశించి గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ తెలంగాణలో అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసి, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో భూ సమస్యలను పరిష్కరిం చడానికి తీసుకువచ్చిన ధరణీ పోర్టల్ లోపాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వం భావిస్తున్నట్లు భూ సమస్యలకి పరిష్కారం దక్కకపోగా, కొత్త సమస్యలు వస్తున్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 2018 లో ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వం రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామన్న హామీ ఇప్పటివరకు అమలు కాలేదని, ఆ హామీని అమలు చేస్తారా, లేదా అని ప్రశ్నించారు. ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఫారెస్ట్ అధికారి హత్య అది గుత్తి కోయలు, గిరిజనులు చేస ిన హత్య కాదని, ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని, ప్రభుత్వ పోడు భూముల సమస్య పరిష్కరించకపోవడం వల్ల ఇటు వంటి సంఘటనలు జరుగుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామ ని అన్నారు ధాన్యం కొనుగోలు విషయంలో వారి ఇష్టం వచ్చినట్లు తరుగు పేరుతో ప్రభుత్వ అధికారులు దళారులు కోత విధిస్తున్నారని, దీని వల్ల రైతులు తీవ్రంగా నష్ట పోతు న్నారన్నారు. ఈ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరిం చాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్ర మా లు చేపట్టి ప్రజలను చైతన్యం చేస్తుందని పేర్కొన్నారు.
ఆర్డీవోకు వినతిపత్రం అందజేత..
నిరసన దీక్ష అనంతరం కాంగ్రెస్ శ్రేణులు, సీఆర్ పల్లి వాసులతో కలిసి ఆర్డీవో కార్యాలయం వరకు భారీ ర్యాలీగా తరలివెళ్లారు. అనంతరం ఆర్డీవో కు గండ్ర సత్యనారాయణ రావు వినతిపత్రం అందజేసి, వారికి ఇళ్ళ పట్టాలు ఇచ్చి, ఇం టి నంబర్లు కేటాయించాలని ఆర్డీఓ ను కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆయన వెంట టిపిసిసి సభ్యులు చల్లూరి మధు, భూపాలపల్లి నియోజకవర్గ కో ఆర్డినేటర్ మార్క విజరు, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు గుమ్మడి శ్రీదే వి, ఎస్టీ సెల్ జిల్లా చైర్మన్ సమ్మయ్య, పట్టణ అధ్యక్షుడు ఇస్లా వత్ దేవన్, రూరల్ అధ్యక్షుడు సుంకరి రామచంద్రయ్య, వైస్ ప్రెసిడెంట్ వంగ మహేష్, పట్టణ కౌన్సిలర్లు దాట్ల శ్రీని వాస్, ఉడుత సరోజన-రాయమల్లు, సీనియర్ నాయకులు అంబాల శ్రీనివాస్, తోట సంతోష్, రామినేని రవీందర్, ఎస్టి సెల్ ఛైర్మెన్ సమ్మయ్య, రైతు విభాగం జిల్లా అధ్యక్షులు సుధా కర్, పట్టణ నాయకులు పిప్పాల రాజేందర్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బండ శ్రీకాంత్, ఎన్ఎస్యూఐ జిల్లా అధ్య క్షులు భట్టు కరుణాకర్, నగునూరి రజినీ కాంత్, మహేందర్, పధ్వీ, రంజిత్, హఫీజ్, కిషోర్ పాల్గొన్నారు.