Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
జిల్లా అభివృద్ధికి ఉద్యోగులందరూ కృషి చేయా లని, జిల్లాలో టీఎన్జీవోఎస్ భవనం నిర్మించుకోవడం ఎంతో సంతోషకరమైన విషయమని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో నిర్మించిన ట్ణిఎన్జిఓఎస్ నూతన భవన ప్రారంభోత్స వానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డితో కలిసి హాజరై ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాల వల్ల జిల్లాలో ఒక ప్రాణ నష్టం జరగకుండా కృషి చేసినందుకు సంతోషం వ్యక్తం చేశారు.
రాష్ట్ర సాధనలో ఉద్యోగుల పాత్ర గొప్పది:ఎమ్మెల్యే
తెలంగాణ ఉద్యమంలో పెన్‌డౌన్ సకల జనుల సమ్మె ద్వారా ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఉద్యోగుల పాత్ర ఎంతో గొప్పదని, సాధించుకున్న రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసం ఉద్యోగులుగా మీ హక్కు ల సాధనకై మీరు ఏ సహాయం అడిగిన మేము ఎల్లవేళలా అందుబాటులో ఉంటామన్నారు. అనంత రం ఎన్జిఓఎస్ ఉద్యోగులు జిల్లా కలెక్టర్,ఎమ్మెల్యే ల ను శాలువాలు కప్పి గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బూరుగు రవి కుమా ర్, జిల్లా కార్యదర్శి ఎమ్.హరికష్ణ, కోశాధికారి దశరథ రామారావు, టిఎన్జిఓ కేంద్ర సంఘంఅధ్యక్షులు మా మిళ్ల రాజేందర్, సిటీ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్, మునిసిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకటరాణి సిద్దు, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, పదవ వార్డు కౌన్సిలర్ బద్ది సమ్మయ్య, యూనియన్ జిల్లా కార్యవర్గము మరియు అన్ని యూనిట్ల అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.