Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - జనగామ కలెక్టరేట్
రైతు సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్య మని, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కాంగ్రెస్ పార్టీ నిరంతరంగా పోరాడుతుందని మాజీ మంత్రి, టీపీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం రైతులు ఎదుర్కుంటున్న రైతు మాఫీ, రైతు బీమా, రైతుబంధు, ధరణి పోర్టల్ తదితర సమస్యలపై పోరుబాటగా జనగామ చౌరస్తా నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. వివిధ సమస్యలపై అదనపు కలెక్టర్ ప్రఫూల్ దేశాయికి వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం పొన్నా లక్ష్మయ్య మాట్లాడుతూ... రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 24 లక్షల ఎకరాల భూముల వివరాలు ధరణిలో కనిపించడం లేదని, ప్రైవేటు వ్యక్తులకు, కంపెనీలకు దారాధత్వం చేసినట్లుగా కనిపిస్తుందని, తక్షణమే భూ సమస్యలు పరిష్కరించాలన్నారు. ధరణితో రాష్ట్ర ప్రభుత్వం రైతుల పొట్ట కొడుతుందని, రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. పోడు భూముల పట్టాలు ఇవ్వకుండా కమిటీలతో ప్రభుత్వ కాలయాపన చేస్తుందని ఆరోపించారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని కోరారు. కేసీఆర్ పాలనలో రైతులు అగమాగం అవుతున్నారని, కౌలు రైతులు రైతే కాదం టున్నారని, వరికి కనీసం మద్దతు ధర దక్కడం లేదని అన్నారు. తాలు, తరుగు, తేమ పేరుతో రైతులను నిలువునా దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, సమస్యలను పక్కదారి పట్టించేందుకు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. పెట్టుబడులను గుజరాత్‌కు తరలిం చుకు పోయేందుకు మోడీ కుట్ర చేస్తున్నారని ఆరో పించారు. పట్టింపులతో, పంతాలతో కేసీఆర్, మోడీ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని, రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలంటే కాంగ్రెస్‌తోనే సాధ్యమని అన్నారు. ప్రజా సమస్యలు చర్చకు రాకుండా పక్కదారి పట్టించేందుకే ఢిల్లీ లిక్కర్స్, ఎమ్మెల్యేల కొనుగోళ్ల అంశము తెరమీదకి తీసుకువస్తున్నారన్నారు. టీపీసీసీ కార్యదర్శి కోట్ల శ్రీనివాస్, మద్దూరు జెడ్పిటిసి గిరి కొండల్ రెడ్డి, టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి ధర్మ సంతోష్ రెడ్డి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాసంపల్లి లింగాజీ, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బడికే ఇందిరా, పట్టణ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాసు, జిల్లా నాయ కులు ఉడుత రవి, మీడియా ఇన్చార్జి పిట్టల సతీష్, పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండి మాజీద్, జిల్లా నాయకులు కృష్ణస్వామి, రవి, మరిగడి ఎంపీటీసీ సలేంద్ర శ్రీనివాసు, ఓబీసీ జనగామ జిల్లా అధ్యక్షులు ప్రవీణ్, రాజనర్సింహారెడ్డి, చేర్యాల అధ్యక్షుడు శ్రీనివాసు, పలు మండలాల అధ్యక్షులు మహేందర్‌రెడ్డి, శ్రీనివాస్, గురవయ్యగౌడ్, అంజయ్య, ఉమ్మడి మద్దూరు మండల అధ్యక్షుడు శ్రీనివాస్, సేవాదళ్ రాష్ట్ర ఆర్గనైజర్ సుంకర శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ధరణి పోర్టల్ రద్దు చేయాలి : లక్ష్మీనారాయణ నాయక్
పాలకుర్తి : ధరణి పోర్టల్ ను రద్దుచేసి రైతులకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేప ట్టాలని టీపీసీసీ సభ్యులు డాక్టర్ లకావత్ లక్ష్మీ నారాయణనాయక్ డిమాండ్ చేశారు. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం నియోజకవర్గం స్థాయిలో తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నాలు నిర్వహించాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపులో భాగంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి ఆదేశాల మేరకు బుధవారం మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ముందు మండల అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి గౌడ్ ఆధ్వర్యంలో పాలకుర్తి నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు ర్యాలీ నిర్వహించి తహ సిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పిసిసి మాజీ సభ్యులు ముత్తినేని సోమేశ్వరరావు, ధర్నా కార్యక్రమ నియోజకవర్గ పరిశీలకులు దుర్గం భాస్కర్‌తో కలిసి లక్ష్మీనారాయణ నాయక్ మాట్లాడారు. ఏటా కౌలు రైతులకు రైతు బీమా, రైతు బంధు పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన పాలసీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోళ్లలో రైస్ మిల్లర్ల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసిల్దార్ భూక్య పాల్ సింగ్ నాయక్ కు అందజేశారు. పాలకుర్తి, తొర్రూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, జాటోతు హమ్యా నాయక్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అనుముల మల్లారెడ్డి, మాజీ ఎంపీపీలు కారుబోతుల శ్రీనివాస్, గడ్డం యాక సోమయ్య, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు ధారావతు రాజేష్ నాయక్, దేవరుప్పుల, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పెద్ది కష్ణమూర్తిగౌడ్, ధారావత్ సురేష్‌నాయక్, మాచర్ల ప్రభాకర్, ముద్దసాని సురేశ్, జక్కుల రామ్ రెడ్డి, సధాకర్, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, సర్పంచులు,ఎంపీటీసీలు నాయకులు పాల్గొన్నారు.