Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
బీసీ-ఎలో ఇతర కులా లను చేర్చడాన్ని ప్రభుత్వం వెంటనే నిలుపుదల చేయాల ని బీసీ'ఏ' కులాల సంఘాల పరిరక్షణ సమితి నాయకులు డీఆర్ బయ్య సాంబమూర్తి డి మాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలోని ఆచార్య డిగ్రీ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో సాంబమూర్తి మాట్లాడుతూ బీసీఏలోని గంగపుత్ర,వడ్డెర, నాయిబ్రాహ్మణ, రజక, పూసల, జంగాలు కులాలు అనాదిగా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి దుర్మరంగా బ్ర తికారన్నారు. నేటికీ ఇంకా అన్నిరంగాల్లో వెనుకబాటుగానే మిగిలిపోయార న్నా రు. ప్రభుత్వం ఇతర కులాలను బీసీఏ కేటగిరిలో చేర్చడం వల్ల సంచార, అర్థ సం చార జాతులైన బీసీఏలోని 67 కులాలకు రిజర్వేషన్ ఫలాలు అందకుండా పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.వెంటనే ఇట్టి నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలన్నారు. లేనిపక్ష్యంలో బీసీ'ఏ' కులాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందన్నారు. ఈ సమావేశంలో బీసీఏ పరిరక్షణ సమితి అడ్హాక్ కమిటీ కన్వీనర్ సాంబరాజు మల్లేశం, గుంటి కిషన్, బయ్య నారాయణ, ఒర్సు వెంకన్న, ఐలోని శ్రీనివాస్, బైరి నాగరాజు, షేర్ల శ్రీనివాస్, చేను నరేష్, జీజుల సాగర్ తదితరులు పాల్గొన్నారు.