Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంగెం
విద్యార్థులు ఇష్టపడి చ దువులో రాణించి, రాబోయే భవిష్యత్తుకు బంగారు బాట లు వేసుకొని సమాజంలో పే రు ప్రఖ్యాతులు సంపాదిం చాలని ఎంపీపీ కందగట్ల కళావతి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఆరవ తరగతి విద్యార్థినిలకు, ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినులకు, ఏడవ తరగతిలో తల్లిదండ్రులు లేని విద్యార్థులకు దుప్పట్లు, బ్లాంకెట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదువుకొని భవిష్యత్తులో ఉన్నతమైన స్థానంలో ఉండి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. అందు కోసం ఎంత కష్టమైనా ఇష్టపడి చదువుకోవాలని సూచించారు. పదవ తరగతిలో 10/10 సాధించిన విద్యార్థులకు సొంతంగా బహుమతులను అందజేస్తానని హా మీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గుండేటి బాబు, ఎంపీటీసీ మల్ల య్య, స్పెషల్ ఆఫీసర్ కే నీలిమ, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.