Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నన్నపనేని పీఏను కట్టినంగా శిక్షించాలని డిమాండ్
- తెలంగాణ రాష్ట్ర సమితి దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ-మట్టెవాడ
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ప్రైవేటు పిఏ శివ తొ పాటు మరో ఇద్దరిని అత్యాచారయత్నం కేసులో హనుమకొండ పోలీస్ లు గురువారం అరె స్టు చేసిన నేపథ్యంలో నన్నపనేని నరేందర్, టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరే కంగా మహిళలపై జరుగుతున్న అత్యాచార దాడులను అరికట్టాలని కోరుతూ వ రంగల్ హనుమకొండ జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయిని రాజేందర్ ఆధ్వ ర్యంలో మాజీ మంత్రి కొండ సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండ మురళిలు శుక్రవారం వరంగల్ ఎంజీఎం కూడలిలో పెద్దఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి టీఆర్ ఎస్ దిష్టి బొమ్మను దహనం చేశారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే పిఏ ను కఠినంగా శిక్షించాలని మహిళకు న్యాయం చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రోడ్డుపై బయటయించడం తో గంటపాటు ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది . కాం గ్రెస్ శ్రేణుల నిరసన కార్యక్రమం విషయం ముందే తెలుసుకున్న పోలీసులు వరం గల్ ఏసీపి పరిధిలో ఉన్న మూడు పోలీస్టేషన్ల సీఐలు, ఎస్ఐల ఆధ్వర్యంలో ఎ టువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మిలిటరీ బలగాలతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులను అరె స్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ పాలనలోఆడబిడ్డలకు రక్షణలేకుండా పోయిం దని ఇది రేపిస్టుల పాలనగా పేరు తెచ్చుకుందని స్వయంగా మంత్రులు, ఎమ్మెల్యే లు, ప్రజాప్రతినిధులపైన అత్యాచార ఆరోపణలు వింటున్నామని ఇలాంటి సిగ్గులే ని ప్రభుత్వాన్ని ఇంత వరకు ఎప్పుడూ చూడలేదని మండిపడ్డారు. మహిళాపై అత్యాచార యత్నం కేసులో అరెస్ట్ అయినా తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ వ్యక్తి గత సహాయకుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్ర మంలో మాజీ ఎంపి సిరిసిల్ల రాజయ్య, టీపిసిసి కార్యదర్శి మీసాల ప్రకాష్, నాయ కులు సిద్ధం రాజు, రమేష్, ప్రభాకర్, అశ్లం, తదితరులు పాల్గొన్నారు.